టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంగా 'ముద్ర' ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే ఈ చిత్రానికి పోస్టు ప్రోడక్షన్ పనులు నిర్వహించి గుమ్మడికాయ కోట్టేస్తారని కూడా తెలుస్తుంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారని సినీవర్గాల టాక్.
ఈ చిత్రంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో లావణ్య త్రిపాఠి కాస్త వెనుకబడిపోయింది. అందువలన ఆమె కూడా ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోంది. మరి వాళ్లు ఆశించిన ఫలితాన్ని ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more