NTR gives treat to fans from aravindha sametha అభిమానులకు తారక్ డబుల్ ట్రీట్

Tollywood young tiger ntr gives treat to fans on eve of vinayaka chavithi

Vinayaka Chavithi, Young Tiger NTR, young tiger NTR fans, #Aravindha Sametha, #NTR new poster, audio launch, audio date fixed, Aravindha Sametha Audio release, tollywood, movies, entertainment

On the eve of Vinayaka Chavithi, Here’s a good news to Young Tiger NTR fans, from his upcomming movie #AravindhaSametha, A rocking New Poster of Young Tiger #NTR @tarak9999 released and date fixed for the Audio Album release ie on September 20th.

అభిమానులకు తారక్ డబుల్ ట్రీట్

Posted: 09/12/2018 08:26 PM IST
Tollywood young tiger ntr gives treat to fans on eve of vinayaka chavithi

వినాయక చవితి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేసినందుకు వారు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన పోస్టర్ అని పేర్కోంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తమ ట్వీట్టర్ అకౌంట్ లో పేర్కొంది. దీంతో పాటు మరో విషయాన్ని నేరుగా పోస్టర్ పైనే వెలువరించి తారక్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందించింది. ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ను ఈ నెల 20న విడుదల చేస్తామని పేర్కొంది.

ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్  తెలియజేస్తామని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెలిపింది. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinayaka Chavithi  Young Tiger NTR  NTR fans  #Aravindha Sametha  Trivikram  Audio release  tollywood  

Other Articles