Arjun sarja remembers pains in his film career అవే నా కెరీర్ లో చాలా ఇష్టమైన చిత్రాలు

Arjun sarja remembers pains in his film career

arjun, jai hind, gentle man, oke okkadu, sevagan, tollywood, kollywood, latest movie news, kollywood, movies, entertainment

Sandal wood yester years Hero and present Actor Arjun has openedup during an interview on his career, and the movies fo him, he loves the most.

ఆస్తులమ్మి తీసిన చిత్రం నిలదొక్కకునేలా చేసింది

Posted: 09/15/2018 06:22 PM IST
Arjun sarja remembers pains in his film career

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్ కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటూ, మాస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న కన్నడ నటుడు అర్జున్ మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా నటుడిగా నటిస్తూ నేటి తరం ప్రేక్షకుల హృదయాలపై తనదైన మార్క్ వేసిన ఆయన, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రసీమలో తాను ఎదుర్కోన్న సమస్యల విషయమై ప్రస్తావిస్తూ.. ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

"నేను చేసిన సినిమాల్లో నాకు ప్రత్యేకంగా అనిపించేది 'సేవగన్' అనే సినిమా. అసలు మార్కెట్ లేనప్పుడు నేనే దర్శక నిర్మాతగా 'సేవగన్' అనే సినిమా చేశాను. నా ఆస్తులన్నీ అమ్మేసి ఆ సినిమా చేశాను .. అది  నాకు లైఫ్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగులో 'పోలీస్ రౌడీ' పేరుతో వచ్చింది. ఆ తరువాత నా కెరియర్లో నేను చేసిన సినిమాల్లో 'జై హింద్' .. 'జెంటిల్ మేన్' .. 'ఒకే ఒక్కడు' నాకు బాగా ఇష్టమైన సినిమాలు. ఇక ఎందుకురా ఈ సినిమా చేశాను అనుకునే సినిమాలు చాలానే వున్నాయి" అంటూ నవ్వేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjun  jai hind  gentle man  oke okkadu  sevagan  tollywood  kollywood  

Other Articles