Aravindha Sametha theatrical trailer on sep 13 ఆరవింద సమేత ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..

Aravindha sametha theatrical trailer on sep 13

aravinda sametha, jr ntr, pooja hegde, teaser, Maatala Mantrikudu, Trivikram Srinivas, theatrical trailer, Jai lava kusa, Agnyathavaasi, latest film news, latest updates tollywood, movies, entertainment

Jr NTR starrer Aravindha Sametha directed by Trivikram Srinivas, are planing to give the fans a treat on vinayaka chavithi, as the makers are releasing a theatrical trailer on the auspicious occasion.

ఆరవింద సమేత ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..

Posted: 08/27/2018 05:59 PM IST
Aravindha sametha theatrical trailer on sep 13

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ టీజర్ తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యిందన్న వార్తలు అభిమానుల్లో అసక్తి రేపుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం బిజీ షెడ్యూల మధ్య షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

రెండు డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనుండటంతో, అభిమానులందరిలో ఆసక్తి పెరుగుతూపోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వుంది చిత్ర నిర్మాణ సంస్థ. అయితే ఇందుకు అనుగూణంగా ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్ధేశించిన తేదీల ప్రకారం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటూ వేగంగా జరుగుతున్నాయి. ఈ దశలో అత్యంత పవిత్రమైన వినాయక చవితి పర్వదినం రోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది చిత్ర నిర్మాణ యూనిట్.

ఈ నేపథ్యంలో వచ్చేనెల నుంచి ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. వినాయక చవితికి ముందుగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక సాంగ్ బిట్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని అంటున్నారు. సెప్టెంబర్ మూడవ వారంలో ట్రైలర్ ను వదలాలనీ .. దానితోనే మరింతగా అంచనాలు పెంచేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aravinda sametha  jr ntr  pooja hegde  teaser  Trivikram Srinivas  theatrical trailer  tollywood  

Other Articles