కొత్త కథలను సిద్ధం చేసుకోవడంలోను .. పాత్రలను ఆసక్తికరంగా మలచడంలోను దర్శకుడు మారుతికి మంచి నైపుణ్యం వుంది. ఆయన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందింది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ నాయకా నాయికలుగా నటించగా, హీరోకి అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్ చేసింది. గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, తాజాగా ఈ సినిమా నుంచి సింగర్ సత్యవతి (మంగ్లీ) పాడిన ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో .. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడటంలో మంగ్లీకి మంచి పేరుంది.
ఈ సినిమాలోని పాట కూడా 'శైలజా రెడ్డి అల్లుడు జూడే ..' అంటూ తెలంగాణ యాసలో అదరగొట్టేస్తోంది. "శాసనమే తన మాట .. నీ అత్త శివగామి బయట .. పంతం కూతురు ఎదుట .. టామ్ అండ్ జెర్రీ ఆట .., అమ్మకు అచ్చు జిరాక్సు .. ఈ బొమ్మకు పిచ్చి పీక్సు .. బద్దలు కానీ బాక్సు .. వద్దనే మాటకు ఫిక్సు .. అత్తను చూస్తే నిప్పుల కుండ .. కూతురు చూస్తే కత్తుల దండ .. ఈ ఇద్దరూ సల్లగుండా .." అంటూ ఈ పాట జోరుగా సాగుతోంది. ఈ పాటలోనే మారుతి పాత్రలను .. వాటి స్వభావాలను చెప్పేసిన తీరు బాగుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more