Regina Cassandra Takes Up The Kiki Challenge రెజీనా మాత్రమే.. అల్లు శిరీష్ అభినందనలు..

Regina cassandra joins kiki challenge with a kickass dance video

regina casssadra, ragina cassandra kiki challenge, adah sharma kiki challenge, popular kiki challenge, kiki challenge indian, allu shirish, tollywood, movies, entertainment

Actor Regina Cassandra took up #Kikichallenge and #inmyfeelingschallenge and showed off her dance moves by giving it an Indian twist. The actor danced to the song, dressed in a half-saree, during a shooting break.

పల్లెటూరి పడచుగా రెజీనా ‘‘కికి ఛాలెంజ్’’ అదుర్స్..

Posted: 07/31/2018 01:22 PM IST
Regina cassandra joins kiki challenge with a kickass dance video

సోషల్ మీడియా తన విస్తీర్ణాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్న తరుణంలో.. ఎన్నో ఛాలెంజ్ లు తెరపైకి వస్తున్నాయి. ఐస్ బకెట్ సహా ఎన్నింటినో ప్రపంచ నలుమూలలకు చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు మరెందరో ఈ ఛాలెంజ్ లను స్వీకరించారు. ఈ తరుణంలో తాజాగా ప్రపంచ ప్రముఖులను అహ్వానిస్తున్నది ‘కికి ఛాలెంజ్’ అన్న విషయం తెలిసిందే. పాప్ సింగర్ డార్క్ రూపొందించిన తాజా ఆల్బమ్‌ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు స్టెప్పులేయడమే ఈ ‘కికి ఛాలెంజ్’. ఓస్ అంతేనా.. ఇందులో ఏముందీ అంటే..

ఓక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న తరువాత రోడ్డుపై కారు వెళ్తున్న సమయంలో కారులోంచి బయటికి వచ్చి కదులుతున్న కారుతో పాటు స్టెప్పులేసుకుంటూ వెళ్లడమే ఈ ‘కికి ఛాలెంజ్’. ఇప్పటికే చాలా మంది ఈ ‘కికి ఛాలెంజ్’ను తీసుకొని స్టెప్పులేశారు. కానీ అంతా పార్క్ చేసిన కారు వద్ద మాత్రమే డ్యాన్స్ చేయగలిగారు. అయితే హీరోయిన్ రెజీనా కాసండ్రా మాత్రం తన ప్రత్యేకత చూపించుకుంది. కారు కదులుతుండగా దానితో పాటు వెళ్తూ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ హావభావాలు పలికించింది. నడిరోడ్డుపై ఓ అమ్మాయి డాన్స్ చేసిందంటేనే విచిత్రం. అందులోనూ ఓ హీరోయిన్ డాన్స్ చేసిందంటే ఔరా అనుకోవాల్సిందే.

లంగా ఓణీలో అచ్చంగా పల్లెటూరి పడచులా తయారై మరీ ఈ కికి ఛాలెంజ్‌ను చేసి చూపించింది. ఈ డాన్స్ చేస్తున్నంత సేపూ అమె అభినయించిన స్టెప్పులన్నీ కూడా పల్లెలూరి అమ్మాయిలనే తలపించేలా వున్నాయి. మరోలా చెప్పాలంటే.. రెజీనా ఒక్కసారిగా 70, 80లలోని నటీమణులను గుర్తుకు తీసుకువచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదు. రెజీనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంప్రదాయ ఓణీలో ఇంగ్లిష్ పాటకు స్టెప్పులేస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది.

ఇక రెజీనా డాన్స్ వీడియోను చూసిన యువ నటుడు అల్లు శిరీష్ అమెకు అభినందలు తెలిపాడు. కేవలం రెజీనా మాత్రమే ఇలాంటి ధైర్యం చేయగలదని ప్రశంసించాడు. అయితే ఈ ఛాలెంజ్‌ను ఇంతకు ముందే హీరోయిన్ అదా శర్మ పూర్తిచేసింది. అయితే కదులుతున్న కారుతో కాకుండా ఆగి ఉన్న కారు వద్ద చేసింది. మరోవైపు, ఈ వైరల్ ట్రెండ్‌పై ఇప్పటికే పోలీసులు ఓ కన్నేశారు. కదులుతున్న కారుతో ఇలాంటి డ్యాన్సులు చేయడం వల్ల చాలా మందికి గాయాలయ్యాయట. అందుకే ఈ ట్రెండ్‌కు వెంటనే అడ్డుకట్ట వేయాలని ముంబై పోలీసులు కార్యచరణ రచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles