RX 100 Movie First Week Collections 'ఆర్ ఎక్స్ 100' సినిమా కలెక్షన్లు అదుర్స్..!

Rx100 first week box office collections report

RX100, Box Office Collections, Ajay Bhupathi, Karthikeya, Payal Rajput, rx 100 movie collections, rx 100 collections, rx 1001st week collections, movies, entertainment, tollywood

The small budgeted flick RX 100 emerged as the biggest blockbuster in the industry. Made with a budget of 2.5 crores, the film already collected 15 crores.

'ఆర్ ఎక్స్ 100' సినిమా కలెక్షన్లు అదుర్స్..!

Posted: 07/19/2018 03:46 PM IST
Rx100 first week box office collections report

యూత్ కి నచ్చితే .. మాస్ ఆడియన్స్ మెచ్చితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందనే విషయాన్ని 'ఆర్ ఎక్స్ 100' మరోసారి నిరూపించింది. ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది ఏ స్థాయిలో పండుతుందనేదానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచింది. తొలి రోజున భారీ ఓపెనింగ్స్ తో థియేటర్స్ దగ్గర మొదలైన సందడి .. ఆరు రోజులు పూర్తయినా అలాగే కొనసాగుతోంది. యూత్ అడియన్స్ చిత్రాన్ని విజయపథంలో నిలుపారు.

అంతంతమాత్రం అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తో అంచనాలను తిరగరాసుకుని హిట్ చిత్రంగా దూసుకెళ్తుంది. దీంతో యూత్ అడియన్స్ లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరగడంతో చిత్రం విజయపథంలో సాగుతూ చిత్ర నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుంది. బాక్సాఫీసు వద్ద చిన్న చిత్రాలు కూడా పంబరేపుతాయని ఇదివరకే అనేక చిత్రాలు రుజువు చేసినా.. తాజాగా అర్ ఎక్స్ 100 కూడా నిరూపితం చేసింది.

కేవలం రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, తొలి నాలుగు రోజులలోనే 10 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది. 6 వ రోజు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 15 కోట్లకి చేరుకున్నాయి. ఒక్క తెలంగాణలోనే ఈ సినిమా 3 కోట్ల షేర్ ను రాబట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే సమయంలో థియేటర్స్ కి వచ్చిన 'విజేత ' .. చినబాబు' .. 'ఆర్ ఎక్స్ 100' స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా వసూళ్ల పరంగా ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశమని చెప్పాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RX100  Box Office Collections  Ajay Bhupathi  Karthikeya  Payal Rajput  tollywood  

Other Articles