మెగా సినీవారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రిఇచ్చిన కొణిదెల నిహారిక ఒక్కమనసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమె నటించిన తన రెండో చిత్రం మాత్రం అభిమానుల్లో అసక్తిని కలిగిస్తూ అంచనాలను పెంచుతున్నాయి. హీరోయిన్ గా గుర్తింపుతో పాటు తన అభినయంతో ప్రేక్షకులలో నూటికి నూరుమార్కులు వేయించుకునే ప్రయత్నంలో వున్న నిహారిక.. హ్యాపీ వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ వీడియోలోనే తన హావభావాలను ప్రదర్శించి అకట్టుకున్నారు.
కాగా, తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ట్రైయిలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తో అమె తన నటనను పండించినట్టే కనిపించింది. ఫీల్ గుడ్ ఫ్యామిటీ ఎంటర్ టైనర్ గా వస్తున్న హ్యాఫీ వెడ్డింగ్ చిత్రంలో ఎమెషనల్ డ్రామాతో కూడకున్నట్లు వుంది. మీ మాగాళ్లంతా ఇంతేనా.. నేను కన్ఫామ్ చేయగానే మీలో ఎందుకంత మార్పు అంటూ అమె ప్రశ్నించిన విధానం.. హీరోతో డాన్స్ కోసం చేయిపట్టుకున్నాక కూడా వదిలేసి అవేదనతో వెళ్లిపోవడం.. అంతా అమెను పరిపూర్ణ నటిగా మార్చినట్లుగా వుంది. ఇక మోగా వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. తన నటనలో మాత్రం పూర్తి పరిపక్వత కనబర్చి.. తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు కష్టపడిందనే చెప్పాలి.
నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ డిఫరెంట్ వీడియోతో నిహారిక ఆకట్టుకోగా చిత్ర ట్రైలర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more