బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘సంజూ’ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున ఈసినిమా ఏకంగా 4,000 స్క్రీన్లపై ప్రదర్శితం కాబోతోందని సమాచారం. కేవలం ఒక్క భాషలో విడుదల అవుతున్న సినిమా ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఒక రికార్డే. రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ గా నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాని రూపొందించారు. ఒక స్టార్ హీరో బయోపిక్ కావడం, అందునా సంజయ్ దత్ బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది వరకూ సంజయ్ దత్ తో పలు సినిమాలు రూపొందించిన దర్శకుడే రాజ్‌కుమార్ హిరాని. ఇక దర్శకుడిగా ఈయనకు అపజయం అంటూ లేదు. ఈ నేపథ్యంలో దత్ బయోపిక్ బాగుంటుందనే అంచనాలున్నాయి. ట్రైలర్ ఆ భరోసాను ఇస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో తొలి రోజు వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
జూన్ 29న అంటే..ఈ శుక్రవారం సంజూ విడుదల కాబోతోంది. తొలి రోజు వసూళ్లు భారీగా ఉంటాయని, తొలి వీకెండ్‌కు ఈ సినిమా గ్రాస్ వసూళ్లతో వంద కోట్ల రూపాయల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్‌లో రెండు వందల కోట్ల రూపాయల వరకూ వ్యాపారం చేసిందని టాక్. థియేటరికల్ హాక్కులను ఈ మొత్తానికి సేల్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల షేర్‌ను అలవోకగా వసూలు చేయగలదనే అంచనాలున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more