bharat ane nenu 50 days Collections Report 50 రోజుల దాటి దూసుకెళ్తున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’

Mahesh babu attack on box office bharat ane nenu 50 glorious day

Koratala Siva, Kaira Advani, Bharat Ane Nenu, Mahesh Babu, Tollywood, Box Office Collections, Bharat Ane Nenu Total Collections, movies, entertainment, tollywood

Bharat Ane Nenu starring Super Star Mahesh Babu is celebrating a successful run of 50 days today. The movie has set great records at the box office already which proved the craze of the actor.

50 రోజుల దాటి దూసుకెళ్తున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’

Posted: 06/08/2018 01:28 PM IST
Mahesh babu attack on box office bharat ane nenu 50 glorious day

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ అర్థశతదినోత్సవం పోస్టర్స్‌ను విడుదల చేసింది. తొలిరోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లను రాబడుతూ నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మహేష్ కెరియర్లోనే బెగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

సందేశాత్మక చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి.. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో.. ఉన్నతమైన నిర్మాణంతో మంచి సంగీతం, నేపథ్యగానం.. భారీ తారాగణం అన్ని కలసివచ్చియనే చెప్పాలి. విడుదలైన మూడు వారాల్లో రూ. 149.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. మహేశ్ బాబు కెరియర్లో 92 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తాజాగా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరిన్ని కలెక్షన్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఈ చిత్రం మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 22 కోట్లకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు అత్యధిక రేటుకు అమ్ముడైన విషయంలో 'బాహుబలి' తరువాత స్థానంలో 'భరత్ అనే నేను' నిలిచింది. కథాకథనాలు .. కొరటాల - మహేశ్ కాంబినేషన్ .. మహేశ్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ .. సంగీత సాహిత్యాలు ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తీసుకొచ్చాయనే మాట వాస్తవం.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koratala Siva  Kaira Advani  Bharat Ane Nenu  Mahesh Babu  Box Office Collections  Tollywood  

Other Articles