Anasuya gets another multi-starer offer రంగమ్మత్త దశ తిరిగింది.. మరో మల్టీస్టారర్ లో కూడా..!

Rangammatta anasuya bharadwaj gets another multi starer offer

Anasuya Bharadwaj, multi starrer movie, venkatesh, varuntej, Anil ravipudi, Dil Raju, tollywood, movies, entertainment

Anasuya Bharadwaj is currently basking in the success of her recent outing Rangasthalam. But now if there is anything she’s more excited about, it has to be the offer she is to play in a multi starer moive staring victory venkatesh and varun tej.

రంగమ్మత్త దశ తిరిగింది.. మరో మల్టీస్టారర్ లో కూడా..!

Posted: 04/24/2018 02:03 PM IST
Rangammatta anasuya bharadwaj gets another multi starer offer

బుల్లితెర క్రేజీ స్టార్ గా, జబర్దస్త్ యాంకర్ గా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూన్నా.. ఇటీవల వచ్చిన రంగస్థలం మాత్రం అమెకు నటిగా మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టిందనే చెప్పారు. ఈ సినిమాలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. సినిమా ఫుల్ లెంత్త్ లో అమె పాత్ర వుండటం, దానికి అనుగూణంగా అమె నటించడం.. ప్రముఖుల ప్రశంసలను అందుకోవడంతో అమెకు కలసి వచ్చింది.

ఈ సినిమాతో ఆమెకి వరుస ఆఫర్లను తెచ్చిపెడుతుంది. ఇంకా చెప్పాలంటే.. అనసూయ కోసమే ప్రత్యేక పాత్రలను సృష్టించడం.. పాటలను క్రియేట్ చేయడం మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకి అనిల్ రావిపూడి సినిమాలో ఒక కీలకమైన రోల్ దక్కిందని సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విక్టరీ వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles