65th National Film Awards: Complete List of Winners అభినేత్రిని వరించిన జాతీయ ఫిల్మ్ అవార్డు.. జాబితా ఇదే..

Sridevi wins posthumous national award for mom

65th national awards winners lisyt, 65th National Film Awards: Complete List of Winners, national awards, Sridevi, Village Rockstar, vinod khanna, national film awards, bollywood, tollywood, sandalwood, mollywood, movies, entertainment

Amit Masurkar's Newton, which was India's pick for the Oscars this year, won the Best Hindi Film honour at the 65th National Film Awards. Late actress Sridevi has been named Best Actress for MOM.

అభినేత్రిని వరించిన జాతీయ ఫిల్మ్ అవార్డు.. జాబితా ఇదే..

Posted: 04/13/2018 02:58 PM IST
Sridevi wins posthumous national award for mom

కళాభినేత్రి శ్రీదేవి మరోమారు రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం మామ్. ఈ జగదేకసుందరి అభిమానులను వదిలి వెళ్లినా,. అమెకు అభినయానికి మాత్రం అవార్డులు అందుతూనే వున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం ప్రకటించిన 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డుల జాబితాలో కూడా అమెను అవార్డులు వరించాయి. ఢిల్లీలోని శాస్త్రీ భవన్ లో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న విభిన్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ప్రకటించారు.

2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్ హుస్సేన్‌, గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి, అనిరుద్ధా రాయ్ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే ఉన్నారు. మే3న విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాలకూ స్థానం దక్కింది. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిన ఘాజీ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కింది. బాహుబలి రెండో భాగానికి మూడు అవార్డులు దక్కాయి. బాహుబలి యాక్షన్ డైరెక్టర్‌కు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ అవార్డు దక్కింది. బాహుబలి కంక్లూజన్‌కు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా చోటు దక్కింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా బాహుబలి2 సత్తా చాటింది. జాతీయ అవార్డును సొంతం చేసుకున్న చలనచిత్రాలు ఇవే...

 

ఉత్తమ తెలుగు చిత్రం - ఘాజీ
ఉత్తమ బెంగాలీ చిత్రం- మయూరాక్షి
ఉత్తమ అస్సామీ చిత్రం- ఇషు
ఉత్తమ తమిళ చిత్రం - టూలెట్
ఉత్తమ గుజరాతీ చిత్రం- డీహెచ్‌హెచ్
ఉత్తమ మలయాళ చిత్రం- తొండిముత్తళుం ద్రిక్‌సాక్షియుం
ఉత్తమ హిందీ చిత్రం- న్యూటన్
ఉత్తమ కన్నడ చిత్రం- హెబ్బెట్టు రమక

 

దాదాసాహెబ్‌ పాల్కే అవార్డ్‌- వినోద్‌ఖన్నా 
ఉత్తమ నటి-శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్‌ రెహమాన్‌ (కత్రు వెలియాదు)
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా లదాక్‌
స్సెషల్‌ జ్యూరీ అవార్డ్‌- నాగర్‌ కీర్తన్‌ (బెంగాలీ)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్(భయానకం)(మలయాళం)
ఉత్తమ కథా చిత్రం: విలేజ్ రాక్‌స్టార్స్(అస్సామీ)
ఉత్తమ సినీ విమర్శకుడు- గిరిధర్ ఝా
 
ఉత్తమ నృత్య దర్శకుడు- గణేష్ ఆచార్య (టాయ్‌లెట్ కీ ప్రేమ్ కథా)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్- రామ్ రజాక్(నాగర్ కీర్తన్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్- సంతోష్ రాజన్(మలయాళం)
బెస్ట్ ఎడిటింగ్- రీమా దాస్ (అస్సామీ చిత్రం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- షాషా తిరుపతి
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కేజే యేసుదాసు
ఉత్తమ సహాయ నటి- దివ్యదత్త (ఇరాదా- హిందీ)
ఉత్తమ సహాయ నటుడు- ఫహద్ ఫాజిల్
ఉత్తమ సామాజిక చిత్రం- ఆలోరుక్కం
ఉత్తమ బాలనటుడు (భనితా దాస్- విలేజ్ రాక్‌స్టార్స్)

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Village Rockstar  vinod khanna  national film awards  bollywood  movies  entertainment  

Other Articles