Senior Actor Chandramouli Passed Away నటుడు, డబ్బింగ్ అర్టిస్ట్ చంద్రమౌళి కన్నుమూత

Telugu actor chandramouli passes away

chandramouli passed away, senior actor chandramouli, senior actor chandramouli died, chandramouli, character actor, chittoor, dubbing artist, entertainment news, latest tollywood news, latest tollywood updates, telugu character actor, telugu film industry, celebrities, movies, tollywood

Well known Telugu character actor and dubbing artiste Chandramouli breathed his last on Thursday. He was suffering from a few ailments since the last few days.

సీనియర్ నటుడు చంద్రమౌళి ఇక లేరు..

Posted: 04/05/2018 06:56 PM IST
Telugu actor chandramouli passes away

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ చంద్రమౌళి ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెం గ్రామం. ఆయన వయసు సుమారు 70 ఏళ్లు. సినిమాలపై ఆసక్తితో 1971లో చంద్రమౌళి మద్రాసు వెళ్లి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు 200 సినిమాల్లో ఆయన నటించారు. కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన చంద్రమౌళి ముఖం తెలుగు ప్రేక్షకులందిరీ సుపరిచితమే.

చంద్రమౌళి, ఆయన సోదరుడికి ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి గురువు కావడం విశేషం. సుమారు 45 ఏళ్ల పాటు తన జీవితాన్ని సినీ కళామ్మతల్లికే అంకితమిచ్చిన చంద్రమౌళి పెద్ద పాత్రల్లో అవకాశాలు రాకపోవడం బాధాకరం. అయితే పెద్ద పాత్రలు రాకపోవడం పట్ల తానెప్పుడూ బాధపడలేదని చంద్రమౌళి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. సినిమా అంటే పిచ్చితోనే తాను సినీ రంగంలో ఉంటున్నానని, తనకు చిన్న చిన్న పాత్రలు చాలని అనేవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandramouli  passed away  character actor  chittoor  dubbing artist  tollywood  entertainment news  

Other Articles