Amitabh reveals Chiru's look of Sye Raa నెట్టింట్లో ‘సైరా’ ఫోటోల హల్ చల్.. బిగ్ బి చలవే మరి..

Chiranjeevi nayanthara s looks in sye raa narasimha reddy unveiled

Tollywood, Chiranjeevi, Nayanthara, Sye Raa Narasimha Reddy, Chiranjeevi sye raa reddy photos, Nayanthara first look, Amitabh Bachchan, Sye raa narasimha reddy pics, Surender Reddy, viral photos, trending photos

The Bollywood's iconic actor Amitabh Bachchan has officially unveiled the looks of Chiranjeevi and Nayanthara from their upcoming film Sye Raa Narasimha Reddy. He released a few photos from the sets on his Twitter account.

నెట్టింట్లో ‘సైరా’ ఫోటోల హల్ చల్.. బిగ్ బి చలవే మరి..

Posted: 03/30/2018 12:15 PM IST
Chiranjeevi nayanthara s looks in sye raa narasimha reddy unveiled

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత తీస్తున్న తన రెండో చిత్రం.. తన కెరీర్ లోనే 151వ చిత్రం.. చారిత్రక నేపథ్యం వున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీకయ్యాయన్న వార్తల నేపథ్యంలో అవి నెట్టింట్లో సంచలనంగా మారాయన్న విషయం కూడా తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన అభినయానికి అర్థం చెప్పే నేటితరం నటి నయనతార నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రంలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే.

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ఆన్ లైన్ లో లీక్ అయి వైరల్ అవుతున్న నేపథ్యంలో, అదే స్టిల్ కు సంబంధించిన ఒరిజినల్ ఫోటోతో పాటు, మరో రెండు ఫోటోలను అటు ఇద్దరు మెగాస్టార్లు తమ అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. లీక్ వార్తలకు చెక్ పెడుతూ.. వీరు ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారని సమాచారం.

క్రీమ్ కలర్ దుస్తులలో ఎఢమ బుభంపై నుంచి కుడి వైపుకు ఓ వక్కగా వున్న ఎర్రని శాలువాతో మెడలో రాజకాలం నాటి ధగధగ మెరిసే బంగారు అభరణాలతో పోడువుగా జాలువారిన జుట్టుతో చిరంజీవి కూర్చోగా.. ఆయనకు పక్కగా ఆయన పత్నిగా నటిస్తున్న నయనతారతో బంగారు వర్ణం చీరతో తలపై నుంచి వెనుకగా కింది వరకు జాలువారిన సన్నటి దుప్పట (మహారాణుల మాదిరిగా) చేతులకు నిండుగా గాజులు, మెడలో ఆభరాణాలను ధరించి.. తన భర్తతో కలసి వేదపండితుల అధ్యర్వంలో తన రాజ్యప్రజల కల్యాణం కోసం యాగం చేస్తున్న ఫోటోలు విడుదలయ్యాయి.

వీరికి వెనుకగా ఎడమవైపుకు అమితాబ్ కూడా కూర్చనివున్నారు. ఇక వెనుగా ఎరుపు తెలుపు దస్తులు ధరించిన తన రాజకోటలోని సిబ్బంది కూడా వున్నారు. ఇక కింద కూడా పండితులు యాగం నిర్వహిస్తున్న తాలుకు చిత్రాలు ఈ ఫోటోలలో కనబడుతున్నాయి. ఇక మరో ఫోటోలో యాగం అనంతరం సైరా దంపతులను ఆశీర్వదిస్తున్న పండితుల ఫోటోను చిరంజీవి విడుదల చేశారు. ఇందులో అమితాబ్ కూడా కనిపిస్తున్నారు. తొలుత లీక్ అయిన ఫోటో ఒరిజినల్ ను, అమితాబ్ గెటప్ ను రివీల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Nayanthara  Sye Raa Narasimha Reddy  Amitabh bachchan  Surender Reddy  tollywood  

Other Articles