'Jabardasth' anchor Rashmi bold answet to fan అభిమానికి జబర్ధస్త్ యాంకర్ గడుసు సమాధానం

Jabardasth anchor rashmi bold answet to fan

Rashmi Gautham furious about trolling, Rashmi Gautham, Sudheer Jabardast, Fake Wedding

Rashmi Gautham, the Jabardast anchor has given a bold reply to a fan on social media is getting trolled by the netizens. They are angry with her for doing a drama wedding on the reality show. She and her Jabardast co-star Sudheer got married on a TV show and for a TV show.

అభిమానికి గడుసు సమాధానం ఇచ్చిన జబర్ధస్త్ యాంకర్

Posted: 03/20/2018 04:01 PM IST
Jabardasth anchor rashmi bold answet to fan

నటిగా తెలుగుచిత్రసీమకు పరిచయమైనా.. తగిన గుర్తింపు సంపాదించుకోలేకపోయి డీలా పడిన రష్మీ గౌతమ్.. 'జబర్దస్త్' కామెడీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత మస్తు పాప్యులరిటీని సోంతం చేసుకుంది. ఈ క్రమంలో అమె యాంకర్ గా కొనసాగుతూనే.. ఒక టీమ్ లీడర్ గా సుధీర్ తో కొ్ంత క్లోజ్ గా మూవ్ అవ్వడం.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వదంతులు కూడా రావడం.. దానిని వారిద్దరూ వేర్వేరుగా ఖండించడం కూడా జరిగిందే.

తాజాగా ఒక షో కోసం సుధీర్ కి .. రష్మికి పెళ్లి జరిగినట్టుగా చూపించేశారు. పెళ్లి తంతు సహజంగా అనిపించడంతో .. నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అనే సందేహం అభిమానుల్లో ఎక్కువైపోయాయి. దీంతో ఓ అభిమాని ఉండబట్టలేక " మీరు నిజంగానే సుధీర్ ని పెళ్లి చేసుకున్నారా .. లేదా?, క్లారిటీ కావాలి" అనే ప్రశ్నను ట్విట్టర్లో రష్మిని అడిగేశాడు. దాంతో "క్రమం తప్పకుండా ఈ షోను చివరి వరకూ చూడండి .. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది" అంటూ రష్మి గడుసుగా సమాధానమిచ్చింది

అయితే పవిత్రమైన పెళ్లి సంబంధాన్ని కూడా రియాలిటీ షోలలో అపహాస్యాన్ని చేస్తూ ఫేక్ వివాహాలు చేస్తున్నారని.. మరికోందరు అమెను విమర్శిస్తున్నారు. పెళ్లి బంధాన్ని రియాలటీ షోల కోసం అపవిత్రం చేయడంతో మీకు పెళ్లిపై వున్న నమ్మకం, విశ్వాసం ఇంతేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వచ్చిన విమర్శలపై రష్మీ మండిపడుతుందని సమాచారం. అయితే సినిమాల్లో పెళ్లి నాటకాలు అడితే చూస్తారు కానీ టీవీ షోలలో చేస్తే విమర్శిస్తారా.? అన్న ప్రశ్నలు కూడా రష్మీ అభిమాన వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rashmi Gautham  Sudheer Jabardast  Fake Wedding  Troll  social media  entertainment  

Other Articles