మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కెరీర్ లోనే తాను నటించిన అత్యుత్తమ చిత్రంగా రంగస్థలం నిలిచిపోతుందని ప్రకటనను వెలువరించగానే మెగాఅభిమానుల్లో పెరిగిన భారీ అంచనాలు.. ఇవాళ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేయగానే.. వాటంతట అవే అనేక రెట్టు పెరిగిపోయాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాంచరణ్ డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు అవిష్కృతం కానున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో విభిన్నంగా రూపోందుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా అన్ని పోస్టు ప్రోడక్షన్ పనులతో పాటు రీరికార్డింగ్ పనులను ముగించుకుని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ 'రంగ రంగ రంగస్థలాన' అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో గ్రామస్థులతో కలిసి డాన్స్ చేస్తూ చరణ్ ఈ పాటలో అదరగోట్టాడు.
పల్లెలోని సఖ్యతకీ .. సంతోషానికి .. సంబరానికి ఈ పాట అద్దం పడుతోంది. సంగీతం .. సాహిత్యం .. నృత్యం సమపాళ్లలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దేవిశ్రీ స్వరపరిచిన ఈ బాణీ .. ఆయనకి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సాంగ్ ప్రోమో చూసిన తరువాత, ఈ సినిమా హిట్ పై అభిమానుల నమ్మకం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(And get your daily news straight to your inbox)
Dec 12 | హీరోయిన్ శ్రీయ గుర్తుందా.? బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో చివరిసారిగా మెరిసిన ఈ భామ.. ఆ తరువాత నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం కనిపించలేదు. అయితే ప్రస్తుతం అమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పైగా... Read more
Dec 12 | దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన్న టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్... Read more
Dec 12 | ప్రముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. నాటకరంగం, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా, పలు రంగాలలో తన సత్తాను చాటిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. గత కొంతకాలంగా... Read more
Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more
Dec 11 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more