Sindhu Menon Brother Also Booked in Cheating Case | ఫేక్ డాక్యూమెంట్లు.. బుక్కైన సింధూ మీనన్, సోదరుడు

Sindhu menon bank cheating case

Sindhu Menon, Bank Cheating Case, Manoj Karthi, Fake Documents, Bank of Baroda, Karnataka, Sindhu Menon Case

South Indian actress Sindhu Menon and Her Brother Manoj Karthi booked in bank cheating case. Sindhu has been staying away from films since 2012.The actress has been accused of cheating Bank of Baroda along with three others. It is said that an FIR has been registered against the four of them at RMC Yard police station in Karnataka.

ఛీటింగ్ కేసు.. నటి సింధూ మీనన్, సోదరుడిపై కేసు నమోదు

Posted: 03/14/2018 10:26 AM IST
Sindhu menon bank cheating case

నటి సింధూ మీనన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ బ్యాంకును మోసం చేసిందన్న ఆరోపణలపై కర్ణాటకలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు మనోజ్ పై కూడా యశ్వంత్ పూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

మనోజ్ కార్తీ, సింధు, మరో ఇద్దరు కలసి గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజ్ కు తీసుకున్నారు. అయితే ఆ భవనాన్ని తమదిగా చూపి ఆర్ఎంసీ యార్డ్ పరిధిలోని బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకోవాలన్న ఉద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించారు.

అయితే, ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన భవన యజమాని పోలీసులను ఆశ్రయించటంతో వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సింధుపై తొలుత, ఆపై ఆమె సోదరుడిపై కేసు పెట్టారు. ఈ కేసులో పక్కా ఆధారాలు ఉండటంతో ఇప్పుడు ఆమెకు కష్టాలు తప్పేలా కనిపించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles