Talented Hero Essayed in Dumb Role in Next | ఛాలెజింగ్ రోల్ కు సిద్ధమైన నారా రోహిత్.. సాహసమే!

Nara rohit in challenging role

Nara Rohit, Director Manjunath, Dumb Character, Tollywood Nes, Nara Rohit Next

Nara Rohit ready to essayed in Challenging role his next. Directed by Debut Manjunath Complete Details reveal soon.

మూగ పాత్రలో నారా రోహిత్?

Posted: 03/14/2018 10:41 AM IST
Nara rohit in challenging role

టాలీవుడ్ లో ఈ మధ్య హీరోలు వరుసగా ప్రయోగాలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన పాత్రలకు.. ముఖ్యంగా వైకల్యం ఉన్న పాత్రలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఊపిరిలో వీల్ చైర్ కు అంకితమయ్యే పాత్రలో నాగ్.. 'రాజా ది గ్రేట్' లో అంధుడిగా రవితేజ.. ఇక తాజాగా 'రంగస్థలం' చెర్రీ చెవిటి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు టాలెంటెడ్ హీరో నారా రోహిత్ కూడా ఇదే తరహా ప్రయోగం చేయబోతున్నాడంట. తన రాబోయే చిత్రంలో నారా రోహిత్ మూగ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

మంజునాథ్ అనే నూతన దర్శకుడితో అట్లూరి నారాయణరావు నిర్మించే సినిమాలో నారా రోహిత్ ఈ పాత్రలో కనిపించనున్నాడు. ఇది నారా రోహిత్ కి 18వ సినిమా. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Dumb Role  నారా రోహిత్  మూగ పాత్ర  

Other Articles

Today on Telugu Wishesh