Mega Star Eye on Chinese Market with Sye Raa | సైరా కోసం భారీ స్కెచ్.. ఆ దేశంలో కూడా రిలీజ్!

Big sketch for sye raa release

Chiranjeevi, Sye Raa, China Release, Producer Ram Charan, Kochi Schedule, Director Surender Reddy

Chiranjeevi Sye Raa Movie Release in China Also. Megastar has planned a long shooting schedule in China, and is eager to release his film there.“After Kochi, Chiranjeevi is taking a big team to China to shoot some major scenes there. The actor is keen to release the film in China too,” says a source.

సైరా కోసం భారీ ఫ్లాన్.. చైనాలో కూడా రిలీజ్!

Posted: 03/09/2018 10:31 AM IST
Big sketch for sye raa release

సైరా నరసింహారెడ్డి... మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టు కావటంతో అంతే ప్రతిష్టాత్మకంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. రెండో షెడ్యూల్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకి పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.

ఇక ఈ చిత్ర మార్కెట్ కోసం కొత్త స్ట్రాటజీని ఫాలో కావాలని మెగాస్టార్ భావిస్తున్నాడు. చారిత్రక పోరాట యోధుడి కథ యూనివర్సల్ కావటంతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు విదేశాల్లో కూడా భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

దీంతో చైనాలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత చరణ్ కు చెప్పాడంట. అంతేకాదు కొచ్చి లో షూటింగ్ తర్వాత.. చైనాలో ఓ షెడ్యూల్ ఫ్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ అమీర్, తాజాగా సల్మాన్ కు మంచి ఆదరణ లభించింది. దీనికి తోడు బాహుబలితో అక్కడ తెలుగు చిత్రాలకు కూడా ఓ మార్కెట్ ఏర్పడింది. ఈ కారణాలతో చైనీస్ లో కూడా సైరా నరసింహారెడ్డి సందడి చేయబోతుందన్న మాట. ప్రస్తుతం డిజిటల్, శాటిలైట్ రైట్ల ధరకు డిమాండ్ భారీగానే వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles