లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ త్వరలో బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. తన తొలి చిత్రం 'ధడక్'(మరాఠీ బ్లాక్ బస్టర్ సైరాట్ రీమేక్) షూటింగ్ లో పాల్గొంటోంది. ఇంతలోనే శ్రీదేవి హఠాన్మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. ఇక పుట్టెడు శోకంలో కూడా జాన్వీ తన కమిట్ మెంట్ ను చూపింది. అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కావాలనుకుంది. అందుకే ధడక్ షూటింగ్ కు హాజరైంది.
బాధను మనసులోనే దిగమింగిన జాన్వీ, సినిమా షూటింగ్ లో జాయిన్ కాగా, చేసే పనిపై జాన్వీ కమిట్ మెంట్ ను మెచ్చుకుంటూ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును జరుపుకున్న జాన్వీ, ఇప్పుడు సినిమా కోసం పూర్తిగా సహకరిస్తానని చెప్పటం ప్రశంసనీయమే. అయితే ఈ రెండింటిపైనా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వాళ్లు లేకపోలేదు.
కాగా, 'ధడక్' ప్రస్తుత షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీరిద్దరూ కోల్ కతాలో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంటర్వెల్ తరువాత కనిపించే హైదరాబాద్ దృశ్యాలు... హిందీలో కోల్ కతా నగరంలో షూట్ చేయనున్నట్లు సమాచారం. శశాంక్ కైతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 20న ధడక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more