Chitti Babu Waiting for Rangasthalam Reaction | చిట్టిబాబు రియాక్షన్ ఎవరి కోసమంటే...

Upasana about rangasthalam wraps up

Upasana Konidela, Ram Charan, Rangasthalam, Chitti Babu, Shooting Wraps Up, Tweet, Upasana with Chitti Babu

Upasana Konidela says Ram Charan's Rangasthalam wraps up entire shoot. Chitti Babu Waiting to Hear Fans Reaction for Rangasthalam She Tweeted.

చిట్టిబాబు రియాక్షన్ కోసం వెయిటింగ్

Posted: 03/05/2018 10:20 AM IST
Upasana about rangasthalam wraps up

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. వ్యక్తిగత విషయాలతోపాటు భర్త చెర్రీకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్టు చేస్తూ ఆసక్తికర విషయాలను చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆయన నటించిన తాజా చిత్రం రంగస్థలం గురించి ఓ పోస్ట్ చేసింది.

ఈ నెల 30న ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని తన భర్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన తెలిపింది. ‘చిట్టిబాబు’ మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాడని వ్యాఖ్యానించింది. అలాగే, ‘చిట్టిబాబు’ గెటప్‌ లో ఉన్న చరణ్‌ తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో ఉపాసన పంచుకుంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి తుది పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉపాసన ఇలా స్పందించిందన్న మాట. సుకుమార్ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం’లో చరణ్‌ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మి’గా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles