Sridevi Biopic is Stupid Attempt says Varma | శ్రీదేవి బయోపిక్.. అంత కన్నా మూర్ఖత్వం ఉండదు : వర్మ

Varma denies sridevi biopic

Ram Gopal Varma, Sridevi Biopic, Sridevi Biopic Fake, RGV on Sridevi Biopic, Actress Sridevi Biopic

Ram Gopal Varma Condemns Sridevi Biopic Rumours. It was Stupid Attempt he clarified. Earlier Some Media Channels Reported that Sridevi's biggest fan Ram Gopal Varma to direct a biopic.

శ్రీదేవి బయోపిక్ ఉండదు : వర్మ

Posted: 03/03/2018 12:39 PM IST
Varma denies sridevi biopic

తన అభిమాన నటి శ్రీదేవిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అదంతా ఉత్త వార్తలే అని వర్మ స్వయంగా ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో తాజా ట్వీట్ తో ఆ వార్తలకు చెక్ పెట్టారు.

‘‘శ్రీదేవి జీవిత చరిత్రపై నేను ఒక సినిమా తీస్తున్నానంటూ మీడియాలో ఓ వర్గం పేర్కొన్నదంతా అవాస్తవం. ఈ విధమైన ప్రయత్నం చేయడం కూడా మూర్ఖత్వమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి పాత్రను పోషించే నటీమణి ఎక్కడా లేదు’’ అని వర్మ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.

కాగా, శ్రీదేవి హఠాన్మరణం తర్వాత భావోద్వేగానికి లోనై వర్మ నాటి నుంచి పోస్టులు పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles