Dipika Kakar Nikkah in Controversy | వివాదంలో సీరియల్ నటి పెళ్లి.. ‘మతం మార్చుకోవటం ఎందుకసలు’?

Serial actress wedding in controversy

Dipika Kakar, Shoaib Ibrahim, Sasural Simar Ka Actress, Shoaika, Dipika Kakar Wedding, Dipika Kakar Troll

Sasural Simar Ka fame Dipika Kakar changed her name to marry Boyfriend Shoaib Ibrahim; Twitterati trolls the duo.The duo's wedding card pic is now going viral on the Internet and as per reports, this invitation card has been used to invite people in Shoaib’s village. On this card, the name of the bride is Faiza and groom’s name is written as Shoaib.

వివాదంలో బుల్లితెర నటి వివాహం

Posted: 02/24/2018 04:51 PM IST
Serial actress wedding in controversy

బుల్లితెర నటి దీపికా కకార్ వివాహం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. 'ససురాల్ సిమర్ కా' సీరియల్ తో పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి దీపికా కకార్. ఆమె గత కొంతకాలంగా ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో ఉంది. ఈ జంటను ‘షోయికా’అని వ్యవహరిస్తుంటారు కూడా.

చివరకు పెద్దలను ఒప్పించిన ఈ జంట తాజాగా వివాహం చేసుకుంది. అయిన తన మతం మార్చుకుని మరీ దీపిక.. షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడటం వివాదాస్పదం అయింది. తన పేరును ఫైజ్ గా మార్చుకున్న దీపిక, యూపీలో ఇబ్రహీంను నిఖా చేసుకుంది. ఆపై 26వ తేదీన ముంబైలో బాలీవుడ్, టీవీ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఇవ్వనున్నట్టు తెలిపింది.

అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె మతం మార్చుకోవడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తుండగా, షోయబ్ స్పందిస్తూ, కేవలం పెళ్లి కార్డుపై మాత్రమే ఫైజా అని పేర్కొన్నామని, ఆమె ఇకపై దీపికా ఇబ్రహీంగానే ఉంటుందని చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles