Big Announcement : Sun Pictures Movie with Rajinikanth | రూమర్స్ కు పుల్ స్టాప్ పెట్టిన రజనీ.. ఆ టాలెండెట్ దర్శకుడితో మరో సినిమా

Rajinikanth movie in sun pictures

Rajinikanth, Sun Pictures, Director Karthik Subbaraj, Rajinikanth Next Movie, Kollywood News, Rajinikanth Continue Movies

Sun Pictures Major Announcement that movie with Rajinikanth Officially announced. Talented Director Karthik Subbaraj deal this Project. Earlier Reports sais that Rajini good bye to movies and concentrate on Politics only.

మరో సినిమా అనౌన్స్ చేసిన రజనీ

Posted: 02/23/2018 04:37 PM IST
Rajinikanth movie in sun pictures

ఒక వైపున రజనీకాంత్ 'కాలా' .. '2.ఓ' రెండూ విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టిసారిస్తారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసి రజనీ ఇప్పుడు మరో సినిమాను అంగీకరించారు.

రజనీ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమ తదుపరి సినిమా ఉంటుందని, తాజాగా సన్ పిక్చర్స్ వారు ఒక ప్రకటన చేశారు. సుబ్బరాజు పిజ్జా, జిగరతాండ, ఇరైవి చిత్రాలతోపాటు ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా మెర్క్యూరీ అనే చిత్రాన్ని తీస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారి సినిమా అంటే అది ఎంతటి భారీస్థాయిలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చేసినా .. వాటిలో వైవిధ్యం కారణంగా, కార్తీక్ సుబ్బరాజ్ లోని ప్రతిభ కారణంగా ఈ ఛాన్స్ ఆయనకి దక్కింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకదానిని సన్ టీవీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. మరో వైపు కాలా ఏప్రిల్ 27న విడుదల అవుతుండగా.. 2.ఓ రిలీజ్ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles