Total Strategy Change for NTR-Trivikram Movie | ఎన్టీఆర్-త్రివిక్రమ్ అనుకున్నది మాత్రం కావట్లేదు!

Actress confirmed for ntr trivikram

NTR, Trivikram Srinivas, NTR Trivikram, Pooja Hegde, SS Thaman, NTR 28th Movie, NTR Trivikram Movie

NTR-Trivikram Movie Actress Confirmed. Pooja Hegde Lead in NTR 28th Movie. Initially Anu Emmanuel as Heroine and Anirudh Ravichander Confirms for this Movie.

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. హీరోయిన్ కుదిరినట్లే!

Posted: 02/19/2018 05:43 PM IST
Actress confirmed for ntr trivikram

జై లవకుశ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న ఎన్టీఆర్ కుటుంబం కోసం సమయం వెచ్చిచూస్తున్నాడు. అయితే వచ్చే నెల నుంచి తన తర్వాతి చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ చిత్రం ఉండబోతుందన్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం కోసం తీసుకున్న టెక్నీషియన్ల విషయంలో ఆ మధ్య కొన్ని వార్తలు రాగా.. ఇటు నిర్మాతలుగానీ, అటు దర్శకులుగానీ ఏ మాత్రం స్పందించలేదు. కానీ, ముందుగా ప్రచారం జరిగినట్టుగా ఈ సినిమాలో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నట్లు స్పష్టత వచ్చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాజూకు సుందరి పూజా హెగ్డే దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

యూనిట్ త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడిచేయనున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని సంస్థ వారు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మార్చి రెండవ వారంలో ఆరంభించనున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ ను కూడా దాదాపు ఖరారు చేసింది. స్టోరీ విషయంలో కొన్నాళ్ల క్రితం కథనాలు వెలువడగా.. అవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles