Nikhil Next Movie Confirms Safe Release Date | కిర్రాక్ పార్టీ రిలీజ్ డేట్.. అదీ నిఖిల్ లెక్క

Nikhil kirrak party release date

Nikhil Siddharth, Kirrak Party, Kirrak Party Remake, Kirrak Party Release Date, Nikhil Next Release Date, Simran Pareenja, Samyuktha Hegde, Sharan Koppisetty

Nikhil Siddharth Kirrak Party gets Release Date. The makers of Kirrak Party starring Nikhil have taken a sensible and calculating approach regarding the release date. They have sensed there is no point in having a hurried release. Kirrak Party according to the buzz in the industry will arrive in cinemas on March 22. It gives the makers enough time to promote and build awareness on the product.

నిఖిల్ కిర్రాక్ పార్టీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Posted: 02/19/2018 05:24 PM IST
Nikhil kirrak party release date

మార్చి నెల వచ్చేసింది. సమ్మర్ సమరానికి టాలీవుడ్ రెడీ అయిపోయింది. బన్నీ, మహేష్ చిత్రాలతో పోటీ పడటం ఇష్టం లేక చాలా వరకు చిత్రాలు తమ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసేసుకున్నాయి. నాని కృష్ణార్జున యుద్ధం ఒకటి రిలీజ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ రేసులో తాను దిగుతానంటున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కన్నడ కిర్రాక్ పార్టీకిది రీమేక్. సిమ్రాన్ పర్జీనా.. సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. నిఖిల్ కి స్నేహితులైన సుధీర్ వర్మ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించగా .. మరో స్నేహితుడైన చందు మొండేటి సంభాషణలు అందించడం విశేషం. అందుకే ఈ సినిమా సక్సెస్ పై నిఖిల్ బలమైన నమ్మకంతో వున్నాడు.

అయితే టీజర్, ట్రైలర్ విషయాల్లో ఆశించిన మేర ఫలితం రాకపోవటంతో ప్రమోషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిఖిల్ నిర్మాతలకు సూచించాడు. అందుకే రిలీజ్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశాడు. మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ సమయంలో సెలవులు మొదలవుతాయి. పైగా పెద్ద సినిమాలేవీ లేవు. అందుకే సేఫ్ సైడ్ అని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles