Tollywood Actor Gundu Hanumantha Rao Died నవ్వుల మారాజు.. గుండు హన్మంతరావు కన్నుమూత..

Telugu comedian gundu hanumantha rao passes away at 61

gundu hanmantha rao, gundu hanmantha rao passes away, gundu hanmantha rao no more, , comedian, telugu movies, tollywood, rajendra prasad, bramhanandam, shivaji raja, chiranjeevi, telanagana government, celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood

Telugu comedian Gundu Hanumantha Rao, known for his iconic chef character in the TV serial Amrutham, died on Monday morning at the age of 61. The actor was suffering from heart and kidney ailments and was undergoing treatment.

నవ్వుల మారాజు.. గుండు హన్మంతరావు కన్నుమూత..

Posted: 02/19/2018 11:02 AM IST
Telugu comedian gundu hanumantha rao passes away at 61

తెలుగు సినీ వినీలాకాశంలో మరో హాస్య దృవతార అనంతవాయువుల్లో కలసిపోయింది. తన హాస్యంతో అబాలగోపాలాన్ని నవ్వుల పూవ్వులు పూయించిన ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఇవాళ కన్నుమూశారు. గుండె, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సంజీవరెడ్డినగర్‌లోని తన స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మరోమారు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను.. కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించిన హనుమంతరావు 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. నాటకాల్లో ఆయన తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. తర్వాత స్టేజి షోలతో బాగా ఖ్యాతి సంపాదించారు. ‘సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపినా అది విడుదలకు నోచుకోలేదు. దీంతో హస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపోందించబడిన అహ నా పెళ్లంట చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు గుండు హన్మంతరావు. మొత్తం 400 సినిమాల్లో నటించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు హనుమంతరావు స్వీట్ షాపు నిర్వహించేవారు.

2010లో ఆయన భార్య మృతి చెందారు. అంతకుమునుపే ఆయన కూతుకు కూడా మరణించారు. ప్రస్తుతం గుండు హనుమంతరావుకు ఓ కుమారుడు ఉన్నారు. బాబాయి హోటల్, రాజేంద్రుడు గజేంద్రుడు, టాప్‌ హీరో, కొబ్బిరి బోండాం, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, అతడు, భద్ర, ఆట, పెళ్లాం ఊరెళితే , మస్కా.. తదితర విజయవంతమైన చిత్రాల్లో తన అద్భత నటనతో ప్రేక్షకులను నవ్వించారు. హనుమంతరావు మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

హనుమంతరావు బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అమాయకపు పాత్రతో కష్టాలను కొనితెచ్చుకునే పాత్ర.. తెలుగు ప్రేక్షకులను టీవీ సిరియల్ కు కట్టిపడేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం గురించి మా సభ్యుల ద్వారా తెలసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు వైద్య సహాయం కోసం రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.

గుండు హన్మంతరావు పార్థివదేహాన్ని నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, ప్రముఖనటుడు బ్రహ్మానందం, మా అధ్యక్షుడు శివాజీరాజా, దర్శకుడు కాదంబరి కిరణ్, హస్యనటుడు బ్రహ్మానందం తదితర చిత్రపరిశ్రమ ప్రముఖులు సందర్శించారు. హనుమంతరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. హనుమంతరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు.. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. హనుమంతరావు గొప్పతనాన్నివివరించిన బ్రహ్మానందం.. ఆయన నీతినియమాలు ఉన్న వ్యక్తి అని కొనియాడుతూ రు. హనుమంతరావు గురించి చెబుతూ బ్రహ్మానందం కన్నీటిపర్యంతమయ్యారు.
 
‘‘హనుమంతరావు మరణించారనే వార్త వినగానే అలజడి, వణుకు వచ్చింది. వెంటనే ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజాకు మూడు సార్లు ఫోన్ చేసి.. హనుమంతరావు మృతి చెందిన విషయాన్ని నిర్థారించుకున్నాను. తర్వాత హనుమంతరావు తమ్ముడు నాకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని నటుడు హనుమంతరావు. హనుమంతరావును చూసి ఇప్పుడు సినీ ఇండ్రస్టీలోకి వస్తున్న కొత్తతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తనకు సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు నిర్మాతకు కానీ.. దర్శకుడికి కానీ వేషం ఇప్పించాలని హనుమంతరావు అడిగిన సందర్భాలు లేవు. హనుమంతరావు ఆశయాలు ఉన్న గొప్ప నటుడు. తనకుంటూ ఓ శైలిని, ప్రత్యేకతను చాటుకునేవాడు. నాకు ఉన్న అతి తక్కువ మంది మిత్రుల్లో హనుమంతరావు ఒకరు’’ అని బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles