Tholi Prema Magic Collections after First Week | తొలిప్రేమ బ్లాక్ బస్టర్ టాక్.. మరి తొలి వారంలో ఎంత రాబట్టిందంటే...

Tholi prema first week collections

Tholi Prema, Tholi Prema Collections, Tholi Prema Movie, Tholi Prema First Week Collections, Tholi Prema Collections

Amid Block Buster Talk Tholi Prema Movie Collections after one week successful run.

తొలిప్రేమ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

Posted: 02/17/2018 06:54 PM IST
Tholi prema first week collections

మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే తొలిప్రేమ తొలి వారం షేర్‌ 14.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ సినిమా పలు ప్రాంతాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు రూ.కోట్లలో.. నైజాం-5.40, సీడెడ్‌-1.70, నెల్లూరు-0.43, గుంటూరు -1.14, కృష్ణా 1.07, వెస్ట్-0.93, ఈస్ట్-1.18, ఉత్తరాంధ్ర 2.15, కర్ణాటక 1.20, అమెరికా 2.30, ఇతర ప్రాంతాల్లో 0.80 వ‌చ్చాయి. మొత్తానికి తొలి వారంలో 'తొలిప్రేమ' 18.33 కోట్ల రూపాయ‌ల షేర్ రాబ‌ట్టింది.  

బ్లాక్ బస్టర్ ఫిదా త‌రువాత వరుణ్ తేజ్ నటించిన‌ చిత్రం కావటం.. సున్నితమైన ప్రేమ కథ కావటంతో యూత్  'తొలిప్రేమ' కు బాగా కనెక్ట్ అయ్యారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా, ప్రియదర్శి, తదితరులు నటించిన ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles