Cherry Lost his Beard for Boyapati Movie | బై.. బై... పాత గెటప్.. కొత్త అవతారంలోకి మారిపోతున్న చెర్రీ

Ram charan new look for boyapati movie

Ram Charan, Boyapati Srinu, RC 12, Ram Charan New Look, Ram Charan Beard, Ram Charan Boyapati Movie

Ram Charan transform into new look for Boyapati Srinu Movie. Mumbai Stylish make his new look for Mass Family Drama.

కొత్త లుక్కులోకి మారిపోతున్న చెర్రీ

Posted: 02/10/2018 03:41 PM IST
Ram charan new look for boyapati movie

గ్రామీణ నేపథ్యం.. పైగా 1985 నాటి పరిస్థితుల నేపథ్యంలో రంగస్థలం చిత్రం కోసం భారీ గడ్డం లుక్కుతో రామ్ చరణ్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదికి పైగా ఇదే స్టైలింగ్ తో కనిపించిన చెర్రీ ఇప్పుడు లుక్కు మార్చే పనిలో పడ్డాడు.

రంగస్థలానికి గుమ్మడి కాయ కొట్టేయటంతో ఇప్పుడున్న లుక్కును మార్చుకునే పనిలో పడ్డాడు. ముంబైకి చెందిన ఓ స్టైలిష్ దగ్గర లుక్కును మార్చుకుంటున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చెర్రీ తన తర్వాతి చిత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే.

దీంతో కొత్త చిత్రం కోసం పనులను ప్రారంభించేశాడు. ఈ నెల 19 నుంచి చెర్రీ బోయపాటి మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. జూన్ కల్లా తన పోర్షన్ కంప్లీట్ చేసేయాలన్న ఆలోచనలో చెర్రీ ఉన్నాడు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కోలీవుడ్ నటుడు ప్రశాంత్, యువ నటుడు నవీన్ చంద్ర ఇందులో  చెర్రీగా అన్నయ్యలుగా నటిస్తుండగా, స్నేహ వదిన పాత్రలో.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles