Shraddha Kapoor Reacts on Prabhas Marriage | ఆ విషయం ప్రభాస్ నే అడగండి : శ్రద్ధా కపూర్

Shradda kapoor about prabhas

Shraddha Kapoor, Saaho Movie, Prabhas, Wedding Rumours, Shradda Kapoor About Prabhas

Saaho Actress Shraddha Kapoor Reacts on Prabhas Wedding. Ask her about Prabhas’ wedding, which his uncle Krishnam Raju has confirmed will happen this year, and Shraddha ducks the question. “I don’t know, you will have to ask him about it,” she says with a smile.

ప్రభాస్ పెళ్లి గురించి శ్రద్ధా కపూర్

Posted: 02/03/2018 03:40 PM IST
Shradda kapoor about prabhas

బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ అయిన శ్రద్ధా కపూర్ పేరు ఇప్పుడు సౌత్ లో బాగా పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె ప్రభాస్ సరసన సాహోలో నటించటమే. సౌత్ లో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే పాపులర్ అయిపోయింది. అయితే సాహో నేపథ్యంలో ప్రభాస్ తో గత కొంత కాలంగా ఆమె ఫ్రెండ్లీగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఆమె సూటిగా సమాధానాలిచ్చేసింది. ప్రభాస్-తాను.. ఎక్కువగా కెరీర్ కు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకునేవారమని, వ్యక్తిగత విషయాలు తమ మధ్య చర్చకు రావని ఆమె చెప్పింది. ‘‘పెళ్లి అనేది పూర్తిగా ప్రభాస్ సొంత విషయం. మా మధ్య ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదని తెలిపింది. దీనికి సమాధానం ప్రభాస్ మాత్రమే చెప్పగలడు. అతన్నే మీరు అడిగితే మంచింది అని తెలిపింది.

'సాహో' సినిమాను ఒప్పుకోకపోతే ఓ మంచి సినిమానే కాదు, ప్రభాస్ లాంటి మంచి స్నేహితుడిని కూడా కోల్పోయేదాన్నని ఆమె చెప్పింది. తాను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడని శ్రద్ధా పొగడ్తలు గుప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles