Actor Rajeev Kanakala Mother No More | కనకాల కుటుంబంలో విషాదం.. రాజీవ్ తల్లి కన్నుమూత

Rajeev kanakala mother passes away

Rajiv Kanakala, Lakshmi Devi Kanakala, Devadas Kanakala Wife, Passes Away, Suma Mother in Law, Rajiv Kanakala Mother, Lakshmi Devi Kanakala NTR

Actor Rajiv Kanakala's mother Lakshmi Devi Kanakala passed away at the age of 78 on Saturday morning. Lakshmi Devi, who was an acting instructor at a film Institute along with her husband Devadas Kanakala. was suffering from multiple age-related illnesses. She is survived by her husband Devadas Kanakala, son Rajeev Kanakala, daughter-in-law Suma and grandchildren.

కనకాల కుటుంబంలో విషాదం

Posted: 02/03/2018 04:04 PM IST
Rajeev kanakala mother passes away

నటుడు రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి కనకాల (79) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ మణికొండలోని సొంత ఇంట్లో ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

లక్ష్మీదేవి భర్త సీనియర్ నటుడు దేవదాస్ కనకాల అన్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు. తనయుడు రాజీవ్ కనకాల.. కోడలు ప్రముఖ యాంకర్ సుమ. కూతురు శ్రీలక్ష్మీ.. అల్లుడు పెద్ది రామారావు నాటక రంగంలో పేరు పొందారు.

కాగా, లక్ష్మీదేవి రంగస్లల నటిగానే కాదు.. నాట్యకారణి కూడా. అదే సమయంలో పలువురు ప్రముఖులకు ఆమె నటనలో శిక్షణ ఇచ్చారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, ఆహుతి ప్రసాద్ తదితర నటులకు తన భర్తతో కలిసి ఆమె శిక్షణ ఇచ్చారు. వీరికి సంబంధించిన నట శిక్షణాలయాలు హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి. ప్రేమ బంధం, కొబ్బరి బోండాం తదిరత చిత్రాల్లో ఆమె నటించారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు లక్ష్మీదేవి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తోపాటు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

MAA

MAA Condolence

MAA Condolence Kanakala Family

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles