Even Sunny Leone Has Strong Fan Following In India | ఇది ఇండియా.. సన్నీ లియోన్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారు

Karni sena on padmaavta success

Shri Rajput Karni Sena, Padmaavat Movie, Historical Facts, Sunny Leone, Padmaavat, Karni Sena Vijendra Singh, Padmaavat Historical Blunders

Shri Rajput Karni Sena Reactions on Padmaavat Huge Success. "This Is India, Where Even Sunny Leone Has Strong Fan Following" Karni Sena Spokesperson Vijendra Singh said.

పద్మావత్ విజయంపై కర్ణిసేన స్పందన

Posted: 01/31/2018 12:18 PM IST
Karni sena on padmaavta success

రాజ్ పుత్ కర్ణి సేన హెచ్చరికలు, అభ్యంతరాలు పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చిత్రం విడుదలయ్యాక కూడా నిరసనలు కొనసాగినప్పటికీ.. అవేం ప్రభావం చూపలేకపోయాయి. పైగా మౌత్ టాక్ ద్వారా రోజు రోజుకీ ఈ సినిమా కలెక్షన్లు పెరిగిపోతున్నాయ్ కూడా. ఇద్దరు చరిత్రకారులను స్వయంగా ఆహ్వానించి శ్రీ శ్రీ రవి శంకర్ ఈ చిత్రాన్ని వారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. చరిత్రను వక్రీకరించారన్న కర్ణి సేన వాదనను ఆ ఇద్దరూ తోసిపుచ్చారు.

ఈ క్రమంలో చిత్ర విజయం, ఆ ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయంపై కర్ణి సేన స్పందించింది. ‘‘ఇది భారత దేశం. సన్నీ లియోన్ లాంటి శృంగార తారకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటప్పుడు పద్మావత్ హిట్ కావటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు’’ అని కర్ణి సేన ప్రతినిధి విజేంద్ర సింగ్ అంటున్నారు. ఇక చరిత్రకారుల నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. వారసలు సినిమాను నిజంగానే చూశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కర్ణిసేన ప్రతినిధులు లేవనెత్తుతున్న ప్రశ్నలు...

- గర్భవతి అయిన ఏ మహిళ కూడా జౌహార్(అగ్నిలో దూకి ఆత్మాహుతి)కి పాల్పడదు.
- చిత్తోడ్ గఢ్ పై అల్లావుద్దీన్ ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దాడి చేశాడు. కానీ, సినిమాలో మాత్రం 25 ఏళ్లకే చేసినట్లు చూపించారు.
- అసలు చిత్తోర్ ఘఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ కూల్చేసినట్లు చరిత్రలో లేనేలేదు. కేవలం అతను ఆ ద్వారాన్ని పెకలించి వేసి తనతో ఢిల్లీకి తీసుకెళ్లాడు. తిరిగి 400 ఏళ్ల తర్వాత భరత్ పూర్ రాజు సూరజ్ మాల్ మళ్లీ ఆ ద్వారాన్ని పున: ప్రతిష్టించాడు. - - ఒక రాజు ఇంకో రాజ్యంలోకి ప్రవేశించి.. చంపుతానని బెదిరించటం అనేది ఏనాడూ జరగలేదు.

ఇంకా చిత్రంలోని పలు సన్నివేశాలపై కర్ణి సేన అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ లెక్కన్న చరిత్రను వక్రీకరించినట్లే కదా అని కర్ణిసేన దర్శకుడు భన్సాలీపై ప్రశ్నలు గుపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles