Sarathkumar Shocks with Paamban look | షాకింగ్ ఫస్ట్ లుక్.. స్నేక్ మ్యాన్ గా మారిపోయిన సూపర్ హీరో

Paamban look sarathkumar

Paamban, Sharath Kumar, Director Venkatesh, Sharath Kumar Snake Man, Paamban Movie Posters

Sharath Kumar turns Snake Man for Paamban Movie. Venkatesh directs this movie may release this year end.

పాంబన్ తో షాకిచ్చిన శరత్ కుమార్

Posted: 01/31/2018 02:16 PM IST
Paamban look sarathkumar

సీనియర్ నటుడు శరత్ కుమార్ రీఎంట్రీలోనూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. సహయక పాత్రలతోపాటు ఇప్పుడు సోలో హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు. పాంబన్ పేరుతో తెరకెక్కబోతున్న ఆ చిత్ర పోస్టర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో ఆయన స్నేక్ మ్యాన్ అంటే సగ భాగం మనిషి.. సగ భాషం పాము రూపంలో కనిపించబోతున్నాడు. మరో పోస్టర్ లో స్వామి గెటప్ లో ఉండి చేతిలో నాగ దండం పట్టుకుని కనిిపించాడు. వెంకటేష్ డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. తన కెరీర్ లోనే తొలి సారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో శరత్ కుమార్ నటించబోతున్నారు. ఫుల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కబోయే "పాంబన్" పోస్టర్స్ ని చూస్తుంటే ఓ పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ కే ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన భరత్ అనే నేను, సాక్ష్యం చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharath Kumar  Paamban  శరత్ కుమార్  పాంబన్  

Other Articles