Reason behind Venky Roja Ego Clash | 22 ఏళ్లుగా మాటల్లేవ్.. గొడవకు అసలు కారణం ఇదే!

Venky roja distance reason

Actress Roja, Venkatesh, RK Selvamani, Clash, Roja Venkatesh Clash, Chinarayudu Movie Issue, Roja Selvamani

Roja admitted that she isn't on taking terms with Venkatesh.She had a clash with Venkatesh regarding an issue and that's the reason why I haven't acted with him in more films.

వెంకీ-రోజా.. అసలు గొడవేంటి?

Posted: 01/17/2018 11:54 AM IST
Venky roja distance reason

అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇది చాలా మందికి తెలీని విషయమనే చెప్పుకోవాలి. టాలీవుడ్ లో అజాత శత్రువుగా అందరితో స్నేహితుడిగా మెదిలే వ్యక్తి విక్టరీ వెంకటేష్. అలాంటాయనకు నటి రోజాతో దాదాపు 22 ఏళ్లుగా వైరం కొనసాగుతూనే వస్తోంది. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్క హీరో గురించి పాజిటివ్ గా మాట్లాడే ఆమె.. వెంకీ గురించి ఎక్కడా ప్రస్తావించరు. దీనికి తోడు వీరిద్దరు ఏ ఈవెంట్ లో కలిసిన దాఖలాలు లేవు. మరి వీరి మధ్య గొడవలకు అసలు కారణం ఏంటి?

తమిళ్ లో చిన్న గౌండర్ అనే చిత్రం తెలుగులో చిన్న రాయుడి(1992)గా రీమేక్ అయ్యింది. తొలుత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు సెల్వమణి(రోజా భర్త) సిద్ధమైపోయాడు. వెంకీ హీరోగా.. రోజాను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలని ఫ్లాన్ చేసుకుని.. లోకేషన్ వేట కోసం బయలుదేరాడు. ఇంతలో పీఆర్ ప్రసాద్ అనే మరో నిర్మాత ఆ హక్కులను కొనుగోలు చేసి బీ గోపాల్ తో వెంకీ-విజయశాంతిలను పెట్టి సినిమాను డైరెక్ట్ చేయించటం ప్రారంభించాడు. ఈ పరిణామాన్ని సెల్వమణి అవమానంగా ఫీలయ్యాడు.

ఇక తర్వాత పోకిరి రాజా(1995) చిత్రంలో రోజా వెంకీతో నటించింది. తన పోర్షన్ షూటింగ్ అయిపోయాక కూడా ఓ పాటకు సంబంధించి రీ షూట్ పేరిట ఆమెను నిర్మాతలు బెంగళూరు రప్పించారంట. అలా మూడు రోజుల పాటు షూటింగ్ చేయకుండానే ఆమెను హోటల్ వెయిట్ చేయించారంట. అదే సమయంలో సెల్వమణి(అప్పటికే వారిద్దరు ప్రేమలో ఉన్నారు) బర్త్ డే ఉండటంతో నిర్మాతలు చెప్పకుండా ఆమె తిరిగి చెన్నై వెళ్లిపోయింది. దీంతో వెంకీ నుంచి ఆమెకు ఫోన్ వెళ్లిందంట. తనకు సెల్వమణి కంటే ఏది ముఖ్యం కాదని అది పరుషంగా సమాధానం చెప్పటంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రోజా కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో అదికారికంగా దృవీకరించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles