Kamal fixes date for announcing Party name | కమల్ పిచ్చ క్లారిటీ.. ముహుర్తం ప్రకటించేశాడు

Kamal party name announce date

Kamal Haasan, Political Party, Tamil Nadu, February 21, Kamal Party Name, Kamal Tamil Nadu Tour, Kamal Haasan Open Letter

Kamal Haasan to annnounce political party's name on Feb 21. His Home Town Ramanathapuram he plans to begin a state-wide tour on the same day.

ఫిబ్రవరి 21న కమల్ రాజకీయ పార్టీ ప్రకటన

Posted: 01/17/2018 11:02 AM IST
Kamal party name announce date

సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజకీయ అరంగ్రేటం పై ఓ స్పష్టత ఇచ్చేశారు. అమ్మ మరణం తర్వాత నెలకొన్న స్తబ్థత నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పార్టీపై పూర్తి స్పష్టతను ఇస్తూ, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ఫిబ్రవరి 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతుందని అన్నారు. కమల్ సొంత ఊరు రామనాథపురం నుంచి యాత్ర మొదలు అవుతుండగా.. మధురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో తొలి విడత పాదయాత్ర ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు.

‘‘ప్రజలు నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. అందుకే వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే రాజకీయాల్లోకి వస్తున్నా’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తోందని, ప్రజా సంక్షేమ పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని కమల్ తెలిపారు. తన యాత్రకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఇక అదే రోజు కమల్ పార్టీ పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles