Niharika Konidela movie Audio Launches in Malaysia | మలేషియాలో మెగా డాటర్ చిత్రం ఆడియో రిలీజ్

Niharika movie audio in malaysia

Vijay Sethupathi, Oru Nalla Naal Paathu Solren, Niharika Konidela, Gautham Karthik, ONNPS Audio

Oru Nalla Naal Paathu Solren also stars Gautham Karthik and Niharika Konidela. The Movie Audio Launches in Malaysia which also starrer Vijay Sethupathi in Crucial role.

మలేషియాలో నిహారిక మూవీ ఆడియో

Posted: 01/06/2018 05:21 PM IST
Niharika movie audio in malaysia

మెగా డాటర్ నిహారిక ఒక వైపున కథానాయికగా చేస్తూనే, ఇంకోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. 'ఒక మనసు' తర్వాత తెలుగులో మరో ప్రాజెక్టులో నటిస్తున్న నిహారిక కోలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసిన విషయంత తెలిసిందే. 'ఒరు నల్ల నాల్ పాతు సోల్రేమ్' లో గౌతమ్ కార్తీక్(కార్తీక్ తనయుడు) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించాడు.

అడ్వెంచర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి, ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. ఈ సినిమా ఆడియో వేడుక ఈ సాయంత్రం 6 గంటల నుంచి మలేసియాలో ఘనంగా మొదలుకానుంది. 'నడిగర సంఘం నైట్ ఇన్ మలేసియా' అనే కార్యక్రమంలో, అదే వేదికపై ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు.

ఫైనల్ గా సినిమాను జనవరి ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుందని నిహారిక భావిస్తోంది.

నిహారిక కొణిదెల కోలీవుడ్ టీజర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles