Varun Tej puts full stop to all rumors | నేను చెప్పేదాకా ఆగండి-వరుణ్ తేజ్

Varun tej reated on multi starrer news

Varun Tej, Daggubati Rana, Venkatesh Daggubati, Multi-Starrer, Dil Raju, F2 Movie, Anil Ravipudi,

Varun Tej Clarifies rumours of Multi-Starrer with Daggubati Heroes. Says he till not signed any new projects.

మల్టీస్టారర్ వార్తలపై వరుణ్ తేజ్ రియాక్షన్

Posted: 01/06/2018 04:28 PM IST
Varun tej reated on multi starrer news

మెగా హీరో వరుణ్ తేజ్ ఓవైపు తొలిప్రేమ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అదే సమయంలో మరో రెండు క్రేజీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకున్నాం. అందులో ఒకటి అనిల్ రావిపూడి మల్టీస్టారర్ కాగా, మరొకటి రానాతో హథీ మేరీ సాథీలో.. దీంతో వరుణ్ సినిమాలపరంగా వేగం పెంచేశాడని అంతా భావించారు.

కానీ, ఆ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా వరుణ్ ఓ ట్వీట్ చేశాడు. 'తొలిప్రేమ' తరువాత తాను ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పాడు. ఏ ప్రాజెక్టును తాను ఓకే చేయలేదని అన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ఏదైనా ఓకే అనుకోగానే ముందుగా తానే చెబుతానని మరీ స్పష్టం చేశాడు. దాంతో ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేస్తాడని అనుకున్న ప్రాజెక్టులంతా హుళక్కేనని తేలిపోయింది.

కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ - 2' అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్ ఓ కథానాయకుడిగా చేయనుండగా, మరో హీరోగా వరుణ్ ఎంపిక చేసుకున్నట్టుగా టాక్ వచ్చింది. అంతేకాదు మెహ్రీన్ హీరోయిన్ గా కూడా సెలక్ట్ చేశారని వార్త షికారు చేసింది. ఇక హథీ మేరీ సాథీలో రానాతోపాటు ఓ కీలక పాత్ర చే్స్తాడని స్వయంగా చిత్ర దర్శకుడు ప్రభు సల్మాన్ చెప్పాడు. అయితే వరుణ్ ట్వీట్ తో ఆయా వార్తలను వరుణ్ ఖండించినట్లయ్యింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles