Anasuya Aunt role for Ram Charan in Rangasthalam | ఆంటీ రోల్ లో అనసూయ కన్ఫర్మ్

Anasuya role in rangasthalam

Rangasthalam, Ram Charan, Anasuya, Anasuya Rangasthalam, Anasuya RC11

Anasuya Aunty role confirm for Ram Charan's Rangasthalam. Hot Anchor Played Aunt role for Ram Charan

చెర్రీ మేనత్తగానే అనసూయ

Posted: 01/02/2018 05:22 PM IST
Anasuya role in rangasthalam

మెగా పవర్ స్టార్ రంగస్థలం చిత్రం మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 80వ దశకం బ్యాక్ గ్రౌండ్ తోపాటు.. ఇందులోని భారీ తారాగణం.. సుకుమార్ డైరెక్షనే అందుకు కారణం. సమంత హీరోయిన్ గా, జగపతిబాబు, రావు రమేష్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో ఓ పాత్ర పోషించబోతుందన్నది తెలిసిందే.

ఆమెకు చెర్రీకి మేనత్త పాత్రలో కనిపించబోతుందన్న వార్త కొంత కాలం క్రితం చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు ఆల్ మోస్ట్ ఆ వార్తను ధృవీకరించేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. క్రిస్మస్ .. న్యూ ఇయర్ సందర్భంగా బ్రేక్ తీసుకున్న ఈ సినిమా టీమ్, రేపటి నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనుంది. ఈ నెల 12వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో పాటలను చిత్రీకరించనున్నారు. దాంతో దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anasuya  Ram Charan  అనసూయ  రామ్ చరణ్  

Other Articles