Agnyaathavaasi Mass Song Teaser Released | అజ్నాతవాసి టీజర్ ... పవన్ నోట ఊరమాస్ సాంగ్

Kodakaa koteswar rao song teaser

Agnyaathavaasi, PSPK 25, Kodakaa Koteswar Rao Teaser, Kodakaa Koteswar Rao Song, Pawan Kalyan, Trivikram Srinivas, Anirudh Ravichander

Agnyaathavaasi Mass Song Teaser Released. Pawan Signs Kodakaa Koteswar Rao for Trivikram's Celluloid.

అజ్ఞాతవాసి 'కొడుకా కోటేశ్వర రావ్' టీజర్

Posted: 12/27/2017 06:58 PM IST
Kodakaa koteswar rao song teaser

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట పాడిన ప్రతీసారి అభిమానులకు పండగే. తమ్ముడు సినిమా నుంచి పవన్ పాడుతూనే ఉన్నా.. ఆయన పాట పాడిన ప్రతీసారి అభిమానులు ఇదే ఆయన తొలి పాట అన్నంతలా ఫీలవుతూ వస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది. కొడుకా.. కోటేశ్వరరావు అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాశారు.

ఈ పాటను ఇటీవలే పవన్‌కల్యాణ్ ఆలపించగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రికార్డ్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సందర్భంగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం చూశాం. ఇప్పుడు ఈ సాంగ్ రాబోతుందంటూ స్టూడియో లో రికార్డింగ్ కు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.

ఇక ఈ ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ క్యారెక్టర్ పై సస్పెన్స్ కొనసాగుతుండగా చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles