Karthi Cries after Saw his Die Hard Fan's Death | ఫ్యాన్ మరణం చూసి కార్తీ ఎంతగా ఏడ్చాడో...

Karthi cries at his fan funeral

Karthi, Karthi Fan Jeevan, Jeevan Karthi, Karthi Big Loss, Karthi Cry, Hero Karthi Fan Death

Hero Karthi cry after saw his fan's Dead body. Jeevan fan of Karthi recently dies in road accident. Karhi also attend Jeevan marriage recently.

అభిమాని మరణంతో ఏడ్చేసిన హీరో కార్తీ

Posted: 12/27/2017 02:17 PM IST
Karthi cries at his fan funeral

హీరోలు ఫ్యాన్స్ పట్ల ప్రేమ చూపించటం వ్యక్తిగతంగా చాలా కష్టమైన పనే. అడపా దడపా కొందరు తమ అభిమానులను స్వయంగా పలకరించటం కాస్త అరుదైన విషయం అయినప్పటికీ.. వారి మరణంతో శోక సంద్రంలో నిండిపోవటం మాత్రం కాస్త ఆలోచింపజేసే విషయమే. తమిళ స్టార్ హీరో కార్తి ఇప్పుడు అలాంటి బాధతోనే బోరుమన్నాడు. తన వీరాభిమాని మరణాన్ని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు.

జీవన్ కుమార్ అనే కార్తి అభిమాని నిన్న జరిగిన ఓ కారు ప్రమాదంలో చనిపోయాడు. జీవన్ కార్తికి వీరాభిమాని. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కార్తి అభిమానుల సంఘానికి అతను అధ్యక్షుడు కూడా. కార్తి మీద పలు సందర్భాల్లో వీరాభిమానాన్ని చాటుకున్న జీవన్.. తన అభిమాన కథానాయకుడికి వ్యక్తిగతంగానూ చేరువయ్యాడు. కార్తికి కూడా జీవన్ బాగా తెలుసు. మూడు నెలల కిందట అతడి పెళ్లికి కూడా కార్తి హాజరయ్యాడు. ఆ సమయంలో అతను కార్తిని హత్తుకుంటూ ముద్దు పెడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా.

ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. జీవన్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన కార్తి తీవ్రంగా కలత చెందాడు. బుధవారం తిరువన్నామలైలో జీవన్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్తి బోరుమని ఏడ్చేయడం ఒకింత ఆశ్చర్యపరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles