Priyanka Chopra Fires on Remuneration Issue | రెమ్యునరేషన్ గురించి అడిగితే.. ప్రియాంకకు బాగా కాలింది

Priyanka chopra about remuneration

Priyanaka Chopra, Remuneration, Male Domination, Bollywood Remuneration,Zee Awards Performance, Priyanka Chopra Fire Media

Priyanka Chopra sets fire to gender pay gap debate after she demands Rs 5 crore for a 5-minute performance.

కష్టపడుతున్నాం.. రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం : ప్రియాంక చోప్రా

Posted: 12/27/2017 02:46 PM IST
Priyanka chopra about remuneration

హీరోయిన్ల పారితోషకం విషయంలో మునుపటి పరిస్థితులు కనిపించటం లేదు. తాము సినిమా కోసం కష్టపడుతున్నాం కాబట్టే హై రెమ్యునరేషన్ డిమాండ్ చేయటంలో తప్పేం లేదని రకుల్ లాంటి వాళ్లు చెప్పటం చూశాం. తాజాగా బాలీవుడ్ లోనూ ఇలాంటి స్వరమే వినిపించింది. ఓ అవార్డు వేడుకల ఈవెంట్ లో జస్ట్ 5 నిమిషాల డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్రియాంక చోప్రా రూ. 5 కోట్లు తీసుకుందంటూ వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం గురించి కొందరు ఆమెను ప్ర‌శ్నించ‌గా గ‌ట్టిగా స‌మాధానం చెప్పింది.

‘‘క‌ష్ట‌ప‌డ‌తాను కాబ‌ట్టి అందుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఇవ్వాలి. మరి ఇదే ప్ర‌శ్న‌ను హీరోల‌ను ఎందుకు అడ‌గ‌రు? అంటూ ఎదురు ప్రశ్నించింది. 'నాకిచ్చే చెక్ మీద ఎన్ని సున్నాలున్నాయ‌నే విష‌యాన్ని నేను ప‌ట్టించుకోను. నా ఆలోచ‌న‌లెప్పుడూ ఆ సున్నాల‌కు త‌గిన న్యాయం చేశానా? లేదా? అనే విష‌యం చుట్టే తిరుగుతాయి. నేనీ స్థాయికి ఎద‌గ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఆ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌ల‌మే ఇది' అని ప్రియాంక స‌మాధాన‌మిచ్చింది.

పైగా ఈ ప్ర‌శ్న త‌న‌ను అడ‌గ‌డం హాస్యాస్ప‌దంగా అనిపిస్తోంద‌ని, హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంటున్నందుకు గ‌ర్వించాల్సింది పోయి విచార‌ణ‌లు చేపట్ట‌డం సిగ్గుచేట‌ని ప్రియాంక అంది. ఆమె సమాధానంతో కంగుతిన్న మీడియా కిక్కురుమనకుండా వేరే ప్రశ్నలను అడుగుతూ చిట్ చాట్ ను కొనసాగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  ప్రియాంక చోప్రా  

Other Articles