Kollywood Director Sincere Request to Piracy Site | పైరసీ సైట్ కు హిట్ మూవీ దర్శకుడి సిన్సియర్ రిక్వెస్ట్

Kollywood director request to piracy site

Velaikkaran, Director Mohan Raja, Sivakarthikeyan, Nayanthara, Fahadh Fasil, Tamil Rockers, Velaikkaran Piracy

Velaikkaran Director Mohan Raja Requested Tamil Rockers. Upload his latest movie a little bit late. 'Velaikkaran' stars Sivakarthikeyan, Nayanthara and Fahadh Fasil got good apprehensions.

పైరసీ సైట్ కు డైరెక్టర్ రిక్వెస్ట్

Posted: 12/23/2017 04:21 PM IST
Kollywood director request to piracy site

వెలైక్కారన్ దర్శకుడు మోహన్ రాజా తాజా ప్రకటన కోలీవుడ్ లో కలకలమే రేపుతుంది. కొత్త చిత్రాలను రిలీజ్ అయిన రోజే ఆన్ లైన్ లో పైరసీ పెట్టే తమిళ రాకర్స్ కి ఆయన ఓ విజ్నప్తి చేశారు. "ఈ ఒక్కసారికి మా సినిమాను కొంచెం ఆలస్యంగా మీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయండి" అంటూ తమిళ రాకర్స్ ను ఉద్దేశించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

శివకార్తికేయన్ .. నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే పైరసీ మాఫియాని ఉద్దేశించి మోహన్ రాజా ఇలా బతిమాలుకున్నాడు.

తమిళరాకర్స్ ఈ పేరు చెబితేనే అక్కడి దర్శక నిర్మాతలు హడలిపోతారు. బడాస్టార్ల చిత్రాలను సైతం ఎలాంటి బెరుకు లేకుండగా వాళ్లు పైరసీ చేస్తుంటారు. వాళ్లను కట్టడి చేయడానికి నడిగర్ కార్యదర్శి విశాల్ లాంటి వాళ్లు సైతం యత్నిస్తున్నా అది వీలు కావటం లేదు. చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. మోహన్ రాజా ప్రకటన పైరసీ మాఫియా ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles