Nawazuddin Siddiqui transforms into Bal Thackeray | బాల్ థాక్రే టీజర్.. విలక్షణ నటుడి షాకింగ్ అవతారం

Thackeray teaser out

Balasaheb Thackeray, Nawazuddin Siddiqui, Thackeray Teaser, Shiv Sena, Sanjay Raut

Balasaheb Thackeray Biopic Teaser. Nawazuddin Siddiqui captures the spirit of Bal Thackeray as he essays the Shiv Sena leader’s role in his biopic. Starring Nawazuddin in the titular role, the biopic penned by Shiv Sena leader Sanjay Raut, will be directed by Abhijit Panse.

బాల్ థాక్రే టీజర్ వచ్చేసింది

Posted: 12/22/2017 06:39 PM IST
Thackeray teaser out

మహారాష్ట్రలో కొన్ని లక్షల మంది ప్రజలు ఇలవేల్పుగా కొలిచే బాల్ థాక్రే జీవిత చరిత్ర బయోపిక్ గా వచ్చేస్తోంది. శివసేన నేత సంజయ్ రౌత్ కథను అందించగా.. మరో నేత అభిజిత్ పన్సే దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అల్లర్ల సమయంలో నెలకొన్న పరిస్థితులు తదితరాలు చూపించారు. ముంబైలోని ఓ వర్గానికి చెందిన ప్రాంతంలో మరొక వర్గం వారు ఓ పెట్రోల్ బాంబు విసురుతారు. ఆ బాంబు ఓ ఏడుస్తున్న పసిపాప వద్ద పేలి అల్లకల్లోలం జరగడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.

రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు పహారా కాస్తుంటారు. ఆ తర్వాత ఒక గదిలో ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేసుకుంటూ ఉంటాడు....అదే గదిలో ఓ పక్కన ఠాక్రే కొంతమందితో మంతనాలు జరుపుతుంటాడు. చివరగా.. వేలాది మంది ప్రజల మధ్యలో బాల్ థాక్రే ప్రత్యక్షం అవుతాడు. ఇక లీడ్ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ కార్యక్రమానిక ిఉద్దవ్ థాక్రే, అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు.

తన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం సిద్దిఖీకి వెన్నతో పెట్టిన విద్య. బాల్ థాక్రే బయోపిక్ అనగానే ఎవరు లీడ్ చేస్తారనే అనుమానాలు తలెత్తాయి. చివరకు టీజర్ లో సిద్ధిఖీని ఆ లుక్కులోనే చూసేసరికి అంతా షాక్ కి గురయ్యారు. ఈ చిత్ర టీజర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - శివ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా నిన్న విడుదలైంది. జనవరి 23న చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles