Pawan Die Hard Fan's 25th Movie First Look Date Fixed | పవన్ తర్వాత.. ఇప్పుడు నితిన్ వంతు వచ్చేసింది

Nithiin movie first look date out

Nithiin, Nithiin 25th Movie, Gurtunda Seethakalam, Gurtunda Seethakalam First look, Nithiin First look, Pawan Kalyan Creative Works, Director Krishna Chaitanya

Putting an end to all the speculation, the makers of Nithiin's 25th film first look Date Announced. On January 1st New Year the film's title ( Gurtunda Seethakalam is being considered) and first look will be released.

నితిన్ 25వ చిత్రం.. ఫస్ట్ లుక్ తేదీ వచ్చేసింది

Posted: 12/19/2017 04:14 PM IST
Nithiin movie first look date out

లై తో బొక్క బోర్లా పడ్డ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రౌడీ ఫెల్లో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తన ఫేవరెట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాత కావటం ఓ విశేషం అయితే.. త్రివిక్రమ్ కథ సాయం చేయటం మరో విశేషం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇది నితిన్ కు 25వ చిత్రం కావటం మరో ప్రత్యేకత.

ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖాయం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలకపోవడంతో, అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తొలిసారి థమన్ నితిన్ కు సంగీతం అందిస్తున్నాడు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఓ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles