మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. దీంతో తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. జనవరి రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
బోయపాటి మార్క్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండనుందట. విలన్ పాత్రను కూడా బోయపాటి ఆ స్థాయిలోనే మలిచాడని అంటున్నారు. ఈ కారణంగానే విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
దాదాపు ఆయన ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. గతంలో ఆయన 'రక్త చరిత్ర' చేసిన సంగతి తెలిసిందే. పరిటాల రవి పాత్రలో వివేక్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇటీవల తమిళంలో వచ్చిన 'వివేగం' కూడా ఆయనకీ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని అంటున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more