Do you Wanna Partner is Back | వీళ్లు మళ్లీ కలిశారు.. సినిమా తీస్తున్నారు

Salman partner sequel on cards

Partner Movie, Salman Khan, Govinda, Carry On Partner, Salman Govinda, Sohail Khan, Partner 2, Partner Sequel,

Salman Khan and Govinda to reunite for Partner sequel. Carry On Partner, Partner 2 Both titles registered by Sohail Khan.

సల్మాన్ పార్టనర్ సీక్వెల్ వచ్చేస్తోంది

Posted: 12/18/2017 05:15 PM IST
Salman partner sequel on cards

సీనియర్ నటుడు గోవిందాతో కలిసి సల్మాన్ ఖాన్ చేసిన పార్టనర్ చిత్రం గుర్తుంది కదా. డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో 2007లో వ‌చ్చిన ఈ రొమాంటిక్, కామెడీ చిత్రం బిగ్ హిట్ గా నిలిచింది. డూయూ వాన్నా పార్టనర్ అంటూ ఈ ఇద్దరూ చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. వారిద్ద‌రినీ వెండితెర మీద చూడ‌టం నిజంగా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచింది‌. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించే పనిలో పడ్డాడు సొహైల్ ఖాన్‌.

ఈ మేరకు 'క్యారీ ఆన్ పార్ట్‌న‌ర్', 'పార్ట్‌న‌ర్ 2' అనే రెండు టైటిళ్ల‌ను సొహైల్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు బాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే గ‌తంలో కూడా పార్ట్‌న‌ర్‌కి సీక్వెల్ వ‌స్తుందంటూ కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత స‌ల్మాన్‌కి, గోవిందాకి మ‌ధ్య చిన్న గొడ‌వ‌లు రావ‌డంతో సీక్వెల్ నిర్మాణం ఆగిపోయిన‌ట్లు కూడా పుకార్లు వ‌చ్చాయి. అయితే వారిద్ద‌రూ క‌లిసి స‌ల్మాన్ 'వాంటెడ్‌' సినిమాలో క‌నిపించిన త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు రాలేద‌ని అర్థం చేసుకున్నారు.

ఇక ఇప్పుడు సొహైల్ టైటిల్స్ రిజిస్ట‌ర్ చేయించడంతో అభిమానులకు పండగే! ప్రస్తుతం సల్మాన్ నటించిన టైగర్ జిందా హై రిలీజ్ కు రెడీ కాగా.. దబంగ్ 3 తోపాటు భరత్ చిత్రం కోసం సల్మాన్ సిద్ధమౌతున్నాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలోనే పార్టనర్ సీక్వెల్ మన ముందుకు రావటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles