Sabyasachi wedding lehenga for Anushka Sharma | విరుష్క పెళ్లిలో ప్రతీది ప్రత్యేకమే..

Anushka lehenga special

Anushka Sharma, Virat Kohli, Sabyasachi Designer, Virushka Wedding, Anushka Sharma Wedding Lehenga

Anushka Sharma's Sabyasachi wedding lehenga was special. The wedding was performed as per Hindu rituals. Top fashion designer Sabyasachi Mukherjee has designed the wedding ensemble for both the bride and the groom.

అనుష్క లెహెంగాకు చాలా ప్రత్యేకతలు

Posted: 12/13/2017 12:17 PM IST
Anushka lehenga special

మీడియాలో గత రెండు రోజులుగా విరుష్కల వివాహ సందడి మాత్రమే కనిపిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా లాంగ్ లవ్ రిలేషన్ లో ఉన్న టీమిండియా సారథి బాలీవుడ్ స్టార్ నటి ఇటలీలో పెళ్లి చేసుకోవటమే అందుకు కారణం. దీంతో రిసెప్షన్ అయినా కవర్ చేసి తమ ఆనందం తీర్చుకునేందుకు మీడియా ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

ఎంగేజ్‌మెంట్ రింగ్ నుంచి పెళ్లిలో వడ్డించిన ఆహార పదార్థాల వరకు నిమిషానికో వార్త బయటకు వస్తోంది. అయితే తాజాగా పెళ్లిలో అనుష్క ధరించిన లెహంగాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఇన్‌స్టాగ్రామ్’లో పోస్టు చేశారు. అనుష్క ధరించిన లెహంగాను 67 మంది కళాకారులు 32 రోజులపాటు శ్రమించి రూపొందించినట్టు ఆయన వివరించారు. పేల్ పింక్ రంగు లెహంగాపై వింటేజ్ ఇంగ్లిష్ రంగులతో సిల్వర్-గోల్డ్ మెటల్ దారాన్ని ఉపయోగించి ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు.

ఇందులో ముత్యాలు, పూసలు గుచ్చినట్టు పేర్కొన్నారు. ఆమె ధరించిన ఆభరణాల్లో సిండికేట్ అన్‌కట్ వజ్రాలను ఉపయోగించినట్టు తెలిపారు. అలాగే విరాట్ ధరించిన ఐవరీ రా సిల్క్ షేర్వాణీపై వింటేజ్ బనారసీ ప్యాటర్న్‌ను చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు సవ్యసాచి ముఖర్జీ తెలిపారు. ఈనెల 21న ఢిల్లీలో బంధుమిత్రులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ నటులు, వీఐపీలకు విందు ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు కూడా వెళ్లిపోయాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh