Super Star Sister Produce Nani's Next Movie | మంజులతో నాని సినిమా.. ఓ క్రేజీ డైరెక్టర్

Nani next movie producer

Manjula Ghattamaneni, Hero Nani, Director Vikram Kumar, Nani Manjula Movie, Indira Productions Banner, Manjula Vikram Kumar Movie

Manjula Ghattamaneni Produce Nani's next under Vikram Kumar Direction. Manjula now producing and directing Manasuku Nachindi Movie.

నాని హీరో.. మంజుల నిర్మాతగా.. విక్రమ్ చిత్రం

Posted: 12/13/2017 11:49 AM IST
Nani next movie producer

నటశేఖరుడి కూతురిగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల నటిగా పెద్దగా రాణించలేకపోయింది. దీంతో నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆమె చిత్రాలను నిర్మిస్తూ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది అనే ఓ చిత్రాన్ని రూపొందించగా.. ఆ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ అయి ఆకట్టకుంటోంది.

ఇక కొంత కాలంగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆమె చిత్రాలను తెరకెక్కించట్లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేగం పెంచి చిత్రాలను నిర్మించేందుకు డిసైడ్ అయిపోయింది. ఏం మాయ చేశావే చిత్రం తర్వాత ఇప్పటివరకూ నిర్మాణానికి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు వరుసగానే సినిమాలు తీస్తోంది. మనసుకు నచ్చింది తర్వాత మరో సినిమాకు ఆమె కమిట్ అయినట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదయ్యాక మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు.

ఆ చిత్రం ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రమ్ కుమార్ మాంచి స్టోరీ లైన్ వినిపించడం.. కథ విపరీతంగా నచ్చేయడంతో.. వెంటనే మూవీ చేసేద్దామని చెప్పాడట నాని. మరో నెల రోజుల్లోనే
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles