No Wrong in Vishal Political Entry says Sarathkumar | విశాల్ పై శరత్ కుమార్ సింపథీ.. పెళ్లికి లైన్ క్లియర్ ?

Sarath kumar support comments on vishal

Actor Sarath kumar, Actor Vishal, RK Nagar By Election, Sarathkumar Vishal Rift End, Sarathkumar App, Sarathkumar Party, Sarathkumar ASK App

Actor Sarath kumar Shocking Comments on Hero Vishal's Political Entry. He said no wrong in Vishal's RK Nagar Elections Competition. Don't Make that issue big Sharat Kumar suggest some people.

విశాల్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన శరత్ కుమార్

Posted: 12/13/2017 10:27 AM IST
Sarath kumar support comments on vishal

నటుడు శరత్ కుమార్, హీరో విశాల్ మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరత్ కుమార్ వర్గ అవినీతిని ప్రశ్నిస్తూ నడిగర్ సంఘ ఎలక్షన్ లలో విశాల్ పోటీ చేయటం.. అతని వర్గాన్ని గెలిపించుకోవటం.. తర్వాత నిర్మాతల మండలి చైర్మన్ గా గెలిచి తన సత్తా చూపించుకోవటం.. ఈ మధ్యలో శరత్ కుమార్.. ఆయన భార్య రాధిక.. ఇతర వర్గీయుల నుంచి విశాల్ పై విమర్శలు రావటం చూస్తున్నాం.

అయితే ఇప్పుడు విశాల్ రాజకీయ ఆరంగ్రేటాన్ని తప్పు పడుతూ కోలీవుడ్ స్టార్లంతా ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ కు ఓ సీనియర్ హీరో మద్దతు లభించటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. విశాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పేముందని సీనియర్ నటుడు శరత్ కుమార్ చెబుతున్నారు. ఏఎస్‌కే(అకౌంటబుల్, సక్సెస్ ఫుల్, నాలెడ్జబుల్ సిటిజన్స్) పేరిట ఓ యాప్ ను రూపకల్పన చేశారు. ఇది ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ కోసమే తయారు చేశారు.

దీనిని మంగళవారం చెన్నైలో శరత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ యాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విశాల్ ఆర్కే నగర్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై స్పందిస్తూ... ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, విశాల్ పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. కొందరు కావాలనే ఈ అంశాన్ని పెద్దది చేయాలని చూస్తున్నారన్నారు.

గతంలో ఎంజీఆర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న శరత్ కుమార్, సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఆమె కుమార్తె రయాన్, నటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

బలపడుతున్న పుకార్లు.. 

కాగా, గత కొంత కాలంగా శరత్ కుమార్ కు విశాల్ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కోలీవుడ్ లో ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ ఆ మధ్య ప్రేమలో ఉండటం.. విశాల్-శరత్ కుమార్ మధ్య గొడవ నేపథ్యంలో దానికి బ్రేక్ పడిందన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాక తొలి వివాహం తనదేనని విశాల్ గుర్తు చేశాడు. ఇక ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే విశాల్-వరలక్ష్మి వివాహానికి లైన్ క్లియర్ అవుతోందని ఆ కథనాల సారాంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

    తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

    Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

  • Nithin to got out door location for his andhadhun remake

    ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

    Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

  • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

    తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

    Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

  • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

    ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

    Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

  • Yeleti cooking chess backdrop for nithin check

    హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

    Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh