Mahesh Impress with Manasuku Nachindi Teaser | మంజుల టీజర్ కు ఫిదా అయిన మహేష్ బాబు

Mahesh likes manasuku nachindi teaser

Manasuku Nachindi, Manjula Ghattamaneni, Manasuku Nachindi Teaser, Manasuku Nachindi Mahesh Babu, Manasuku Nachindi Actress, Sandeep Kishan, Amyra Dastur, Tridha Chowdary

Manjula Ghattamaneni Directorial venture Manasuku Nachindi Teaser released. Mahesh Babu impress with sister's movie teaser. Sandeep Kishan, Amyra Dastur and Tridha CHowdary in lead role.

మహేష్ మనసుకు నచ్చిన టీజర్

Posted: 12/12/2017 04:47 PM IST
Mahesh likes manasuku nachindi teaser

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌న‌ సోద‌రి మంజుల ఘ‌ట్ట‌మ‌నేని రూపొందిస్తోన్న మ‌న‌సుకు న‌చ్చింది టీజ‌ర్ బయటకు వచ్చేసింది. సందీప్ కిష‌న్‌కి స్నేహితురాలిగా, ప్ర‌కృతి ప్రేమికురాలుగా అమైరా ద‌స్త‌ర్ చెబుతోన్న డైలాగులు ఈ టీజ‌ర్‌లో అల‌రిస్తున్నాయి. జ‌ల‌పాతం, కొండ‌లు, ద‌ట్ట‌మైన చెట్లు వంటి ప్ర‌కృతి అందాల మ‌ధ్య తీసిన సీన్లు అదర‌హో అనిపిస్తున్నాయి.

ఇందులో అమైరా ద‌స్త‌ర్ ప్ర‌కృతి ప్రేమికురాలుగా క‌న‌ప‌డుతోంది. 'ప్ర‌తి మనిషిలో ప్రపంచమంత ప్రేముంటుందిరా.. కాని 0.1 ప‌ర్సెంట్‌ కూడా బయటకి రావ‌ట్లేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయం అవుతుంది' అంటూ హీరోతో హీరోయిన్ చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది.

'విజువల్స్ ఎంజాయ్ చేయండి. షూటింగ్ తీస్తున్న‌ప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మీకోసమే' అని మంజుల త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంటూ ఈ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజర్ మ‌హేశ్ బాబుకి బాగా న‌చ్చేసింద‌ట‌. టీజర్‌ చాలా ఫ్రెష్‌ గా, కూల్‌గా ఉంది అని మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌న సోద‌రికి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ట్వీట్ చేశారు. జనవరి 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles